---Advertisement---

పుంగనూరు నుంచి తిరుపతి వరకు ఉద్రిక్తతలు.. నామినేషన్ల వేళ టీడీపీ దాడులు!

October 16, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పుంగనూరు, రాయచోటి, ధర్మవరం, తిరుపతి ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్‌సీపీ(YSRCP) అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తుండగా టీడీపీ(TDP) శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి (P. Mithun Reddy) కాన్వాయ్‌పై (Convoy) దాడి జరిగిందని, పలు వాహనాలు ధ్వంసమయ్యాయని సమాచారం. నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న అభ్యర్థులను అడ్డుకున్నారని, కొన్ని నామినేషన్ పత్రాలను చించివేశారని బాధితులు ఆరోపించారు.

రాయచోటిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంతో పాటు వాహనాలను దహనం చేశారని, కార్యకర్తలపై రాళ్లు(Stones), కర్రలతో (Sticks) దాడులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు సాయికుమార్(Sai Kumar), పుష్పమణిపై(Pushpamani) దాడి జరిగిందని, పుష్పమణికి గాయాలయ్యాయని పార్టీ నేతలు తెలిపారు. తిరుపతిలో నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న మహిళా అభ్యర్థిని అడ్డుకుని, ఆమె నామినేషన్ పత్రాలను చించివేశారని బాధితురాలు ఆరోపించారు.

ఈ ఘటనలపై వైఎస్సార్‌సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment