ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రాజకీయ వర్గాల్లో కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రానికి చెందిన నలుగురు మంత్రులకు (Four Ministers) మావోయిస్టుల (Maoists) పేరుతో బెదిరింపు లేఖలు (Letters) రావడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పరిణామం అసెంబ్లీ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
మంత్రులు కందుల దుర్గేష్ (Kandula Durgesh), అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad), కొల్లు రవీంద్ర (Kollu Ravindra), సత్యకుమార్ (Satya Kumar)లకు ఈ బెదిరింపు లేఖలు అందినట్లు సమాచారం. ఈ లేఖల వ్యవహారం అసెంబ్లీ లాబీలో విస్తృతంగా చర్చకు దారి తీసింది. రాజకీయ నాయకులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశంపై మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ, తాను పర్యవేక్షిస్తున్న శాఖ చిన్నదేనని, తన వల్ల ఎలాంటి తప్పు జరగలేదని స్పష్టం చేశారు. ఈ లేఖల కారణంగా తన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారని తెలిపారు. నిజంగా మావోయిస్టులే లేఖలు రాసారా? లేక ఎవరో వారి పేరుతో కావాలనే ఈ చర్యకు పాల్పడ్డారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు.
లేఖలపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ ఘటన వెనుక ఎవరైనా ఉన్నట్లయితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఈ బెదిరింపు లేఖల వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి? రాజకీయ కోణం ఉందా? లేక వ్యక్తిగత విద్వేషమా? అనే అంశాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారాయి.






