ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని నలుగురు కేబినెట్ మంత్రులకు (Cabinet Ministers) మావోయిస్టుల (Maoists) పేరుతో బెదిరింపు లేఖలు (Threat Letters) వచ్చాయని వార్తలు వెలువడగా, ఇంటెలిజెన్స్ డీజీ మహేష్ చంద్ర లడ్డా (DG Mahesh Chandra Laddha) ఈ ఈ ఉదంతంపై స్పందించారు. ఈ లేఖలలో 99 శాతం ఫేక్ అని గుర్తించబడిందని ప్రకటించారు.
ఇంటెలిజెన్స్ విభాగం తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణలోని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఒక సర్పంచ్ ఫోన్ నంబర్‌తో ఈ లేఖలు పంపినట్లు గుర్తించారు. అయితే, ఈ సర్పంచ్‌కు కూడా లేఖల గురించి వివరాలు ఏమీ తెలియదని చెప్పుకొచ్చారు.
నలుగురు మంత్రులకే లేఖలు రావడం వెనుక ప్రత్యేక కారణం ఏమీ లేకపోవడంతో, వారి నియోజకవర్గాల్లో వ్యతిరేకులు ఇలా చేయించవచ్చని డీజీ మహేష్ చంద్ర లడ్డా అనుమానం వ్యక్తం చేశారు. మంత్రుల నివాసాల వద్ద భద్రత పెంచాలని సంబంధిత విభాగానికి సూచనలు ఇచ్చారు. ఈ లేఖల వ్యవహారంపై లోతైన విచారణ కూడా కొనసాగుతోందని చెప్పుకొచ్చారు.






