పశ్చిమ ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల ప్రజలకు జీవనాడిగా భావించే వెలిగొండ ప్రాజెక్ట్ (Veligonda Project) మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. జూన్ 15న ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) స్పష్టం చేయడంతో, దీని నిర్మాణ చరిత్ర, ఎవరి పాత్ర ఎంత అన్న చర్చలు వేడెక్కుతున్నాయి.
మార్కాపురం డివిజన్లోని నల్లమల అటవీ ప్రాంతంలో నిర్మితమవుతున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ (Poola Subbaiah Veligonda Project), శ్రీశైలం నుంచి జంట సొరంగాల ద్వారా 53.85 టీఎంసీల నీటిని నల్లమలసాగర్‌కు తరలించే మెగా ప్రాజెక్ట్ గా నిర్మితమౌతుంది. దీని ద్వారా మూడు జిల్లాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్ట్ చరిత్ర ఒక సారి చూస్తే
చంద్రబాబు గారు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండగా వెలిగొండకు మొదటి శంకుస్థాపన 1996 మార్చి 5న చేశారు. నిజానికి డీపీఆర్ 1994లో సిద్దమైంది. అయితే పనులు మాత్రం ప్రారంభం కాలేదనే చెప్పాలి , 9 ఏళ్ళ పాలనలో శంకుస్థాపన సభ నిర్వహణకు 10 లక్షలు ఖర్చు మాత్రమే చేశారనే విమర్శను ఏదురుకున్నారు, ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ కేవలం పేపర్లపైనే నిలిచిపోయిందనేది నీటి రంగ నిపుణులు చెప్పే మాట. 1996లో పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని వెలిగొండ , వరికపుడిసెల లాంటి కోన్ని ప్రాజెక్టులకి హడావిడిగా శంకుస్థాపన రాళ్ళు వేసి వదిలేశారనే అపవాదు మూటకట్టుకున్నారు చంద్రబాబు.
2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhara Reddy) గారు “జలయజ్ఞం” (Jalayagnam)లో భాగంగా వెలిగొండకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో డీపీఆర్ ను పూర్తిగా మార్చి ఆసియాలోనే అతి పొడవైన జంట టన్నెల్ ప్రణాళిక సిద్దం చేసి, 2004 అక్టోబర్ 27న అధికారికంగా పనులు ప్రారంభించారు. నాడు దాని అంచనా వ్యయం 5,300 కోట్లు కాగా అయిదేళ్లలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 3,581.57 కోట్లు ఖర్చు చేసి, 50% పనులు పూర్తి చేశారు. అయితే 2009లో రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం తర్వాత ప్రాజెక్ట్ వేగం తగ్గిపోయింది. 2009–2014 మద్య ప్రాజెక్ట్ పురోగతి లేనట్టే చెప్పాలి
చంద్రబాబు గారి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన అనంతరం వెలిగొండ పనులను మళ్లీ ప్రారంభించినా, పురోగతి లేదని నాడే నీటిరంగ నిపుణుల అభిప్రాయ పడ్డారు. జీవో-22, జీవో-63ల ద్వారా కాంట్రాక్టర్లకు 630.57 కోట్లు అనవసర చెల్లింపులు చేపట్టినట్టు కాగ్ సైతం అభ్యంతరం చెప్పడం విశేషం. అలాగే టీఎంబీ మరమ్మతుల పేరిట 68.44 కోట్లు ఖర్చు చూపినా కానీ తవ్వకం రోజుకు 1–2 మీటర్లు మాత్రమే జరగడం తీవ్రమైన విమర్శలు పాలైంది. చంద్రబాబు గారు పాలనలో మొదటి టన్నెల్ 5 ఏళ్లలో 600 మీటర్లు — రోజుకు సగటు 2.41 మీటర్లు మాత్రమే జరగడం చూస్తే పనులు ఎంత మందకొడిగా సాగాయొ చెప్పచ్చు అలాగే రెండో టన్నెల్ కూడా రోజుకు 1.31 మీటర్లు మాత్రమే పనులు సాగాయి. దీంతో ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్రమైన జాప్యం , ప్రభుత్వ నిరలక్ష్యం జరిగిందని రైతాంగం నుండి విమర్శలు ఏదుర్కున్నారు.
2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గారు తాను ఎన్నికల ముందు రైతాంగానికి హామీ ఇచ్చిన విధంగానే, ప్రాజెక్టు పనులు వేగంగా చేపట్టారని నీటి రంగం నిపుణులు సైతం చెబుతున్నారు. ముఖ్యంగా రివర్స్ టెండరింగ్ ద్వారా 61.76 కోట్లు ఆదా చేయడం కొద్ది కాలంలోనే రెండు టన్నెల్లు పూర్తీ చేయడం. కరోనా సమయంలోనూ పనులు నిలిపిపెట్టకుండా కొనసాగింపు జగన్ పాలనలో ప్రాజెక్టు మైలురాళ్ళుగా చూపుతున్నారు. ఇక జగన్ గారి పాలనలో టన్నెల్ పురోగతి చూస్తే మొదటి టన్నెల్ 2019–2021లో 2.883 కిమీ పూర్తి చేశారు. సగటున రోజువారీ తవ్వకం 4.12 మీటర్లు. ఇక రెండో టన్నెల్ రోజుకు 7.25 మీటర్లు చేసి రికార్డ్ సృష్టించారు. నీటిని నల్లమలసాగర్ వరకు తరలించే హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తయ్యాయి.
నల్లమలసాగర్ ముంపులో 11 గ్రామాలు కాగా మొత్తం నిర్వాసిత కుటుంబాలు 7,321, అయితే 2024 నాటికే పునరావాస కాలనీలు సిద్దం చేసినా ప్రాజెక్టు ఘనత జగన్ కి దక్కుతుందనే ఆలొచనతో జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పటి కూటమి ప్రభుత్వం ఏదుర్కుంటుంది. రైతుల ఆరోపణ ప్రకారం, ప్రభుత్వం జాప్యం వలన 2024–2025, 2025–2026 వరుసగా శ్రీశైలం వరద నీటిని నిల్వ చేసే అవకాశాలు కోల్పోయినట్లు చెబుతున్నారు.
ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టు 2024లోనే దాదాపు పూర్తైనా రెండేళ్ళు జాప్యం చేస్తూ వచ్చి, ఇక 2026 జూన్ 15న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. సీఎం చంద్రబాబు గారు ఇంజినీర్లతో లైవ్ కాన్ఫరెన్స్ నిర్వహించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ నేపధ్యంలో ప్రాజెక్ట్ నిర్మాణ ఘనత తమదే అని తెలుగుదేశం వర్గం ప్రకటిస్తుంటే, రైతులు మాత్రం “వైఎస్సార్ కృషి – జగన్ వేగం – బాబు జాప్యం” అనే అభిప్రాయంతో ఉన్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వెలిగొండ నిర్మాణ చరిత్ర మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.
ఏది ఎలా ఉన్నా ఆ ప్రాంత ప్రజల ఆకాంక్ష మత్రం ఒక్కటే “ప్రాజెక్ట్ పూర్తై నీరు రావాలి!” తమ జీవితాల్లో మార్పు రావాలనేది డిమాండ్ గా వినిపిస్తుంది. మూడు జిల్లాల ప్రజలు మాత్రం దశాబ్దాల నిరీక్షణ ముగిసి వెలిగొండ నీరు తమ ప్రాంతాలకు రావాలని మాత్రమే కోరుకుంటున్నారు.







