ఆంధ్రప్రదేశ (Andhra Pradesh) రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Alliance Government) ఏర్పడిన నాటి నుండే మధ్యాహ్న భోజన పథకం (Midday Meal Scheme) అమలు రోజురోజుకి అద్వానంగా తయ్యారైందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. సీఎం చంద్రబాబు (Nara Chandrababu Naidu), డీసీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), విద్యాశాఖమంత్రి లోకేష్ (Nara Lokesh) పధకం బ్రహ్మాండంగా అమలౌతుందని చెప్పుకేనందుకు పిల్లలతో భోజనం చేసి ఆ నాటికి ఫోటోలు ప్రచారం చేసుకున్నా , రాష్ట్రంలో పెరిగిపోతున్న వరుస కలుషుత ఆహార ఘటనలు సామాన్యులని సైతం దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. గడిచిన 20 నేలల్లో లెక్కకు మించి ఫుడ్ పాయిజన్ ఘటనలు (Food Poisoning Cases) నమోదవ్వడం తీవ్ర ఆందళన చెందాల్సిన అంశం .
గతంలో ఎన్నడు లేని విధంగా జాతీయ మానవహక్కుల కమీషన్ రాష్ట్ర అధికారులకి నోటీసులు జారీ చేసినా పరిస్థితిలో మార్పు కనిపించడంలేదు. పరిస్థితి ఎంత దారుణంగా అయ్యారైంది అంటే ఏకంగా రాష్ట్ర హోం మంత్రి బీసీ బాలికల వసతి గృహానికి వెళ్ళి అక్కడ భోజనం చేసే సమయంలో ఆమే ప్లేట్ లోనే బోద్దింక రావడం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని అద్దం పడుతుంది. ఎంతో ఉన్నతమైన సేవలు అందించిన డోక్కా సీతమ్మగారి (Dokka Seethamma) పేరు ఈ పధకానికి పెట్టి ప్రచారం చేసుకోవడం తప్ప కూటమి పాలకులు పిల్లలకి నాన్యమైన భోజనం అందించండంలో పూర్తిగా విఫలమయ్యారనే మాట వినిపిస్తుంది.
రాష్ట్రంలో గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో కొంతకాలంగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురవుతున్న ఘటనలు పదేపదే జరుగుతున్నాయని తల్లితండ్రులు ప్రజా సంఘాలు ఆవేదన చెందుతున్నారు. కలుషిత నీరు, ఆహార నాణ్యత లోపం వీటికి ప్రధాన కారణంగా ఉంటుందని, వీటిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల పునరావృతమవుతున్నాయని తెలిపారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడల్లా తాత్కాలిక చర్యలు చేపడుతున్నారని, వీటికి పరిష్కారం చూపాలని కోరారు. గతంలో పాడేరు, పార్వతీపురం మన్యం, నంద్యాల, అన్నమయ్య, గుంటూరు, తిరుపతి వంటి జిల్లాల్లో ఈ ఘటనలు కొనసాగుతున్నాయని వివరించారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటి వరకూ జరిగిన ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
చిన్నారుల జీవితాలను చంద్రబాబు ఛిద్రం చేస్తున్నారంటూ వైఎస్ జగన్ (Y. S. Jagan Mohan Reddy) మండిపడ్డారు. ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగునీరు, కలుషిత ఆహారం కారణంగా అనారోగ్యంతో పువ్వల అంజలీ, తొయికా కల్పన, తాడంకి చిన్నారి, బిడ్డిక రష్మిక, మండంకి కవిత , తాడంకి పల్లవి ఇలా 29 మంది పిల్లలు చనిపోయారని ఆయన నిప్పులు చెరిగారు. వందలాది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారని.. కూటమి ప్రభుత్వానికి మాయరోగం వచ్చిందని వైఎస్ జగన్ దుయ్యబటారు.
గత వైయస్సార్ సీపీ హయాంలో రోజుకో మెనూతో పిల్లలకు నాన్యమైన ఆహారం అందించడంలో సఫిలీకృతం అయ్యరనే చెప్పాలి , నాడు నాణ్యతాప్రమాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ , పిల్లలకు ఏ ఇబ్బందీ లేకుండా వైయస్ జగన్ గారు తీసుకున్న శ్రద్ద ప్రశంశనీయం, నాటి ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పేరున ఏకంగా రూ.7,245 కోట్ల ఖర్చు చేసి నాన్యతలో ఎక్కడా రాజీ పడలేదనేది కాదనలేని అంశం.






