---Advertisement---

అర్ధరాత్రి అంగన్వాడిల అరెస్టులు

March 3, 2026

---Advertisement---

కనీస వేతనాలు పెంచాలని (Minimum Wages Increase), తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ విజయవాడలోని (Vijayawada) ధర్నా చౌక్ వద్ద అంగన్‌వాడీ వర్కర్లు (Anganwadi Workers), హెల్పర్లు (Helpers) శాంతియుతంగా 30 గంటలపాటు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ ఆందోళనను విరమించబోమని వారు స్పష్టం చేశారు. రాత్రివేళల్లో కూడా ధర్నా చౌక్ వద్దే ఉండి తమ నిరసనను కొనసాగించారు.

అయితే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, నిద్రలో ఉన్న అంగన్‌వాడీ సిబ్బందిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ (Arrested) చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. టెంట్లను పీకి వేయడం, మహిళలను బలవంతంగా అదుపులోకి తీసుకోవడం వంటి చర్యలు తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. అరెస్టు చేసిన వారిని సత్తెనపల్లె పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ దాడిలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యునియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబి రాణి (Bebi Rani) చేతికి గాయమై, చెయ్యి విరిగినట్లు సమాచారం. పోలీసులు తమ పట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించారని అంగన్‌వాడీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌లోనే తమ బాధను వెల్లడిస్తూ, న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కనీస వేతనాల పెంపు వంటి మౌలిక హక్కుల కోసం పోరాడుతున్న మహిళా కార్మికులపై జరిగిన ఈ చర్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం ఈ ఘటనపై ఎలా స్పందిస్తుంది? అంగన్‌వాడీల డిమాండ్లకు పరిష్కారం దొరుకుతుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment