---Advertisement---

రోడ్డెక్కుతున్న ప్రజలు.. కూటమి పాలనపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత!

July 10, 2026

Summarize with AI

---Advertisement---

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ప్రజా వ్యతిరేకత (Public Opposition) పెరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల (Elections) సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం, మరోవైపు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలతో వివిధ వర్గాల ఆందోళనలకు కారణమవుతోందని ప్రతిపక్షాలు (Opposition Parties) ఆరోపిస్తున్నాయి. కార్మికులు(Workers), రైతులు(Farmers), విద్యార్థులు(Students), మహిళలు(Womens) తదితర వర్గాలు తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిరసన బాట పట్టడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేటీకరణ (Privatization) దిశగా అడుగులు వేస్తోందని కార్మిక సంఘాలు (Labour Unions) విమర్శిస్తున్నాయి. విద్యుత్ బస్సుల (Electric Buses) పేరుతో ప్రైవేటు ఆపరేటర్లకు అవకాశాలు కల్పించడం, విలువైన ఆర్టీసీ డిపో (RTC Depot) స్థలాలను లీజుకు ఇవ్వడం వంటి నిర్ణయాలను ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ (RTC Employees JAC – Joint Action Committee) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఖాళీగా ఉన్న సుమారు 12 వేల పోస్టులను భర్తీ చేయాలని, 4 వేల కొత్త బస్సులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలకు సిద్ధమవుతోంది.

మున్సిపల్ కార్మికులు (Municipal Workers) కూడా ప్రభుత్వ నిర్ణయాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పౌర సేవల (Civic Services ప్రైవేటీకరణకు సంబంధించిన జీవో నంబర్లు 975, 673లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్రలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. హైకోర్టు (High Court) ఆదేశాల ప్రకారం తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి, రిటైర్మెంట్ ప్రయోజనాలు(Retirement Benefits) కల్పించాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో వేతనాల పెంపు హామీ ఇచ్చినప్పటికీ అమలు కాలేదని అంగన్వాడీ కార్యకర్తలు (Anganwadi Workers) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, పని భారం పెంచుతున్న యాప్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్‌ను ముట్టడించారు.

వ్యవసాయ రంగంలో (Agriculture Sector) కూడా రైతుల అసంతృప్తి పెరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. పొగాకు రైతులు (Tobacco Farmers) క్వింటాలుకు రూ.25 వేల గిట్టుబాటు ధర (Remunerative Price) కల్పించాలని కోరుతూ కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపట్టారు. వేలం కేంద్రాల్లో కనీస ధర కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ముడి సరుకుల ధరలు పెరగడం, ఉపాధి భద్రత (Job Security) లేకపోవడం వల్ల చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ఆరోపిస్తోంది. తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది.

విద్యా రంగంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) నిధులు సుమారు రూ.7,000 కోట్ల మేర పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. ఫీజులు చెల్లించకపోవడంతో హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ల వద్ద నిరసనలు నిర్వహిస్తున్నారు.

ప్రజా సమస్యలను పరిష్కరించాల్సింది పోయి నిరసన తెలిపే వారిపై పోలీసు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. విశాఖ ఉక్కు నిర్వాసితులు ఉద్యోగాల కోసం చేపట్టిన వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం వివాదాస్పదమైంది. మరోవైపు సముద్ర తీర ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు అనుమతించే ‘బీచ్ షాక్స్’ (జీవో 362) నిర్ణయంపై మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఇవే కాకుండా పెరిగిన విద్యుత్ ఛార్జీలు (Electricity Charges) సామాన్య ప్రజలపై అదనపు భారంగా మారాయని విమర్శలు వినిపిస్తున్నాయి. తాగునీటి సమస్యతో రాయదుర్గం వంటి ప్రాంతాల్లో ప్రజలు ఖాళీ బిందెలతో రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కంటే ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ప్రయత్నించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ప్రజా వ్యతిరేకత మరింత ఉధృతమయ్యే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment