ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల వాతావరణం ఊహించని మలుపులు తిరుగుతోందనే అభిప్రాయం పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దుతామని, అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఆకర్షిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం భిన్నమైన పరిస్థితులను పాటిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పలు జిల్లాల్లో పరిశ్రమలపై రాజకీయ జోక్యం, స్థానిక నాయకుల జోక్యాలు, కాంట్రాక్టుల వివాదాలు వంటి అంశాలు పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని చర్చ ప్రజల్లో జరుగుతోంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో జమ్మలమడుగు సమీపంలో ఆదానీ గ్రూప్ నిర్మాణ పనుల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, అలాగే కృష్ణపట్నం పొర్ట్ కార్యకలాపాలపై టీడీపీ నాయకుల దాడి ఆరోపణలు రాష్ట్ర పరిశ్రమల వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అనంతపురం జిల్లాలో కీయా అనుబంధ పరిశ్రమలపై టీడీపీ నాయకుల ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలు వినిపించాయి. శ్రీకాకుళం జిల్లాలో యునైటెడ్ బ్రువరీస్ యాజమాన్యంపై డబ్బు డిమాండ్ల ఆరోపణలు వచ్చాయి. అనకాపల్లి జిల్లాలో కోకో కోలా ప్రతినిధులు కూడా దాడులు వేదింపులు బరించలేక కెంద్రానికి ఫిర్యాదులు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. పల్నాడు జిల్లాలో చెట్టినాడ్ , భవ్యా వంటి సిమెంట్ సంస్థలు వేదింపులు తాళలేక ఉత్పత్తిని నిలిపివేసిన సంఘటనలు రాష్ట్ర పారిశ్రామిక వాతావరణంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

అంతేకాకుండా, తాజాగా గత ప్రభుత్వ కాలంలో ఒప్పందం కుదిరిన ఆజాద్ ఇండియా మొబిలిటీ, జూపిటర్ రెన్యువబుల్ ప్రైవేట్ లిమిటెడ్, జిన్ఫ్రా ప్రెసిషన్స్ వంటి సంస్థలు పెట్టుబడుల విషయంలో వెనక్కి తగ్గినట్లు ప్రకటించడం మరింత కలకలం రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం లేదని ? రెడ్ బుక్ అంటూ కొత్త తర్హా పాలనలో పెట్టుబడిదారులు భయాందోళనకు గురవుతున్నారని? రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్, పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక వృద్ధి వంటి అంశాలపై పూర్తిగా ప్రతికూల వాతావరణం పడిందనే అభిప్రాయం పారిశ్రామిక వర్గాల్లో బలంగా వినిపిస్తుంది.






