---Advertisement---

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా కోరుతూ ధర్నా – పోలీస్ కేసు నమోదు

March 4, 2026

---Advertisement---

తన అనైతిక ప్రవర్తనతో తిరుమల (Tirumala) పవిత్రతకు మచ్చ తెస్తున్నారనే ఆరోపణల నడుమ, టీటీడీ ఛైర్మన్ (TTD Chairman) బీఆర్ నాయుడు (B R Naidu) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి పట్టణంలో నిర్వహించిన ధర్నా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నిరసనలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) నేతలపై పోలీసులు కేసు నమోదు చేయడం మరింత రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది.

ఒక మహిళను ముప్పై ఏళ్లుగా వేధిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా (Resignation)చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అలిపిరి గరుడ సర్కిల్ వద్ద మహిళలు, పార్టీ నాయకులు శాంతియుత నిరసన చేపట్టారు. ఈ ఘటనపై అలిపిరి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జగదీశ్వర్ (Jagadeeshwar) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం వివాదాస్పదంగా మారింది.

అసెంబ్లీ సమావేశాల కారణంగా రాష్ట్రంలో 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉన్నందున ఎటువంటి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించరాదని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రానికి మచ్చ తెస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా, నిరసన తెలిపిన తమపై కేసులు నమోదు చేయడం కక్ష సాధింపు చర్యగా వారు విమర్శిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment