---Advertisement---

మండలి చైర్మన్‌పై మత ముద్ర – మంత్రి అచ్చన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు

March 4, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసన మండలి (Legislative Assembly) చరిత్రలో అత్యంత శోచనీయమైన ఘటన నేడు చోటుచేసుకుంది. తిరుమల లడ్డు కల్తీ (Tirumala Laddu Controversy) ఆరోపణలపై చర్చ సందర్భంగా మంత్రి అచ్చన్నాయుడు (Achan Naidu) మండలి చైర్మన్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఒక రకంగా, మండలి చరిత్రలో ఇది ఒక చీకటి రోజుగా చెప్పవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భారత దేశం లౌకిక దేశం. అన్ని మతాలకు, జాతులకు, భాషలకు సమాన గౌరవం దక్కే దేశం ప్రపంచంలో భారతదేశమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారత రాజ్యాంగ నిర్మాతలు ఐక్యతను పునాది చేసుకుని రాజ్యాంగం రూపొందించారు. వారి పునాదుల ప్రకారం దేశానికి అధికారిక మతం లేదు. ప్రతి ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది; పౌరులకు మత స్వేచ్ఛను కల్పిస్తుంది.

కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కొద్ది కాలంగా రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకంగా మత ప్రస్తావన పదేపదే వినిపించడం ప్రజాస్వామ్య వాదులను కలచివేస్తున్న అంశం. ఒక రకంగా చెప్పాలంటే, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిపై జరుగుతున్న మతపరమైన దాడి, మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి విడిపోయి తెలుగు రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఏ రాజకీయ నాయకుడిపై జరగలేదని చెప్పడం అతిశయోక్తి కాదు. నేడు ఏకంగా ప్రతిపక్ష నాయకుడిని మండలిలో ‘క్రైస్తవుడు’ (Christian) అని, అలాగే మండలి చైర్మన్‌ను కూడా ‘క్రైస్తవుడు’ అని మంత్రి హోదాలో అచ్చన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్పూర్తికే విఘాతం. ఇది తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు. గతంలో చంద్రబాబు (Chandrababu) గారు కూడా “ముఖ్యమంత్రి క్రైస్తవుడు, హోంమంత్రి క్రైస్తవుడు, డీజీపీ క్రైస్తవుడు” అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయిన సంగతి ఇప్పటికీ మరువలేదు. ఇప్పుడు మరోసారి మంత్రి అచ్చన్నాయుడు ఏకంగా మండలిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా అనేక విమర్శలను రేకెత్తిస్తోంది.

మండలి చైర్మన్ (Assembly Chairman) గారు రాజకీయ నేపథ్యం లేని సామాన్య దళిత రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగారు. 20 ఏళ్ల చిన్న వయసులో భీమవరం మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా గెలిచి, మరో నాలుగు సార్లు కౌన్సిలర్‌గా గెలుచుకుని అంచెలంచెలుగా ఎదిగి నేడు శాసనమండలి చైర్మన్‌గా (Legislative Assembly Chairman) మోషన్ రాజు (Motion Raju) గారు అత్యంత గౌరవనీయ స్థానాన్ని సంపాదించారు. బలహీన వర్గాలకు స్పూర్తిగా నిలిచిన వ్యక్తి పై మత ముద్ర వేయడం వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రగానే చూడాలని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎన్నికల సమయంలో క్రైస్తవులకు ఇచ్చిన హామీలను ఎన్నికల తర్వాత పట్టించుకోవడం లేదని ఇప్పటికే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు లౌకిక దేశంలో మతాన్ని మండలిలో టార్గెట్ చేస్తూ మాట్లాడటం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని క్రైస్తవ వర్గం అభిప్రాయం. మరోవైపు హిందూ, ముస్లిం పెద్దలు కూడా రాజకీయాలకు మత విశ్వాసాలను వాడుకోవడం తప్పైతే, ఆ గీత దాటి మతాలను నేరుగా టార్గెట్ చేయడం మరింత ప్రమాదకరమని కూటమి పాలకులకు హితవు పలుకుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment