కృష్ణాజిల్లా (Krishna District) గన్నవరం నియోజకవర్గంలోని వీరవల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో (ZP High School) బోధనేతర సిబ్బందిపై (Non-Teaching Staff) విద్యార్థులు (Students) దాడి చేస్తున్న వీడియొ (Video) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. విద్యార్థులు స్కూల్ ప్రాగణంలో ధూమపానం(Smoking) చేస్తుండగా గమనించిన ల్యాబ్ అసిస్టెంట్ రవీంద్ర (Ravindra) విధ్యార్ధులని మందలించడంతో రెచ్చిపోయిన విధ్యార్ధులు ఆయనపై దాడికి దిగారు. దీనిని వారిస్తూ వీడియోలు తీస్తున్న రికార్డు అసిస్టెంట్ రవిపై కూడా దాడికి పాల్పడ్డారు.
అయితే అదే రోజు ఉపాధ్యాయులు వీరవల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, విద్యార్థులను స్టేషన్ కు పిలిపించి కౌసిలింగ్ ఇచ్చిన వెంటనే పోలీసులు వారిని పంపివేసినట్టు. 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ దృష్టిలో ఉంచుకుని విద్యార్థి యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కోంతమంది అభ్యర్ధన మేరకు వారిపై చట్ట పరమైన చర్యలకి దిగలేదనే వాదన స్థానికుల్లో వినపడుతుంది.
దీంతో దాడి జరిగి వారమవుతున్నా ఎలాంటి చర్యలు లేకపోవడంతో అసంతృప్తికి లోనైన బాధితులు సంబంధించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా బయటపెట్టారు. దీంతో విద్యాశాఖ దీనిపై విచారణ చేపట్టింది. ఘటన జరిగిన 8 రోజుల తర్వాత వీడియోలను బయటకు వదలటం వెనుక ఎవరున్నా చర్యలు తప్పవు. దాడికి పాల్పడిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు బూతులు తిట్టి, వీడియోలు తీసిన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని డీఈఓ రామారావు పత్రికా ముఖంగా చెప్పడం తీవ్ర ఆవేదనకి గురించేసింట్తు అక్కడి ప్రజలు చెప్పుకుంటున్న మాట
విధ్యార్ధులు అసాంఘిక చర్యలకి దిగితే తప్పని చెప్పిన వారిపై దాడి చేయడమే కాకుండా బూతులుతో తెచ్చిపోయిన వారిని కాకుండా ఆ ఘటనను వీడియొ తీసి పెట్టినందుకు పాఠశాల సిబ్బందిపై చర్యలు ఉంటయని చెప్పడం ఎంతవరకు సమర్ధనీయమ అంటూ విమర్శలు వస్తున్నాయి. విద్యాశాక తీరు పై నిరసన వ్యక్తం చేస్తున్నారు.






