---Advertisement---

గిరిజనుల సంక్షేమం పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో నిజం లేదా?

March 14, 2026

---Advertisement---

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని (Paderu Constituency) నందిగరువు గ్రామంలో గిరిజనులతో నిర్వహించిన ‘మాటా–మంతి’ కార్యక్రమంలో (Mata-Manthi Interaction Program) పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గిరిజనుల (Tribals) కోసం గత ప్రభుత్వం ఏమీ చేయలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి పనులు వేగంగా జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు.

గిరిశిఖర గ్రామాల్లో కేవలం 18 నెలల్లోనే 460 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించామని, గత ప్రభుత్వ కాలంలో ఈ పనులు జరగలేదని ఆయన అన్నారు. అంతేకాక గత ప్రభుత్వంలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్థితి ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ మద్దతుదార్లు తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాలు పూర్తిగా అసత్యమని, గిరిజనులను మభ్యపెట్టడానికి ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న రహదారుల నాణ్యత కూడా సరైనది కాదని, ఇప్పటికే కొన్ని రోడ్లు పాడైపోతున్నాయని పేర్కొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ (Y. S. Jagan Mohan Reddy) హయాంలో గిరిజనుల అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు ఖర్చు చేసినట్లు వైసీపీ నాయకులు గుర్తు చేశారు. డీబీటీ ద్వారా రూ.13,389 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.5,963 కోట్లు పైన గిరిజనులకు అందించామని తెలిపారు. 500 మంది గిరిజన జనాభా ఉన్న ప్రతి తండా, గూడెంను పంచాయతీగా వర్గీకరిస్తూ 165 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

అటవీ భూములను సాగుచేసుకునే గిరిజన రైతులకు ఆర్వోఎస్ఆర్, డీకేటీ పట్టాలు ఇచ్చి 1.54 లక్షల గిరిజన కుటుంబాలకు 3.22 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశామని తెలిపారు. అలాగే రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం కూడా అందించామని చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదారి నిర్మాణం కీలకమని చెబుతూ, లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకం కింద 1,087 కిలోమీటర్ల రహదారులను నిర్మించామని తెలిపారు.

గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలు త్వరగా అందేలా 897 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించామని వివరించారు. కమ్యూనికేషన్ సౌకర్యాల కోసం 944 మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు బలోపేతం చేయడానికి 879 విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను ప్రారంభించామని పేర్కొన్నారు.

2019–20 నుంచి 2023–24 వరకు ఎస్టీ సంక్షేమం కోసం మొత్తం రూ.20,948.15 కోట్లు ఖర్చు చేశామని, నవరత్నాలు సహా పలు సంక్షేమ పథకాల ద్వారా గిరిజనులకు భారీ స్థాయిలో లబ్ధి చేకూరిందని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో గిరి గోరుముద్ద, బాల సంజీవని, పోషకాహార బుట్ట వంటి పథకాలు అమలు చేసినట్లు తెలిపారు.

ఇంకా గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల జీతాలను రూ.400 నుంచి రూ.4,000కి పెంచామని, రాష్ట్రవ్యాప్తంగా 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలలో 1,55,599 మంది విద్యార్థులకు వసతి మరియు ఇతర సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు.

అలాగే గంజాయి సాగు నిర్మూలన కోసం నిర్వహించిన ఆపరేషన్ పరివర్తనలో భాగంగా 9,371 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసి, సుమారు 3.24 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

ఇక ప్రస్తుత ప్రభుత్వంపై కూడా వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. గిరిజన గ్రామాల్లో అక్రమ మైనింగ్ పెరిగి ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించింది. నర్సీపట్నం, పాడేరు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం గిరిజనులపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.

గిరిజన పాఠశాలల్లో కలుషిత ఆహారం, నీటి కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని, నిర్మించిన రహదారులు ఒక్క వర్షానికే కొట్టుకుపోతున్నాయని విమర్శించింది. పాడేరు ఐటీడీఏ పరిధిలో ఉన్న అనేక గిరిజన గ్రామాల్లో రేషన్ తెచ్చుకోవడానికి ప్రజలు 3 నుంచి 10 కిలోమీటర్ల వరకు కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి ఉందని పేర్కొంది.

అదే సమయంలో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా గిరిజన స్కూల్ పిల్లలను ఫోటోషూట్ కోసం ఎండలో నిలబెట్టారని ఆరోపణలు రావడం కూడా వివాదానికి దారితీసింది. ఈ మొత్తం ఘటనల నేపథ్యంలో పాడేరు ప్రాంతంలో రాజకీయ వాగ్వాదం మధ్య ఉపముఖ్యమంత్రి పర్యటన ముగిసింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment