---Advertisement---

అధిక రేట్లకు మద్యం అమ్మకం – పవన్ కళ్యాణ్ హెచ్చరికకు విలువ లేదా?

March 18, 2026

Summarize with AI

---Advertisement---

కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై దోపిడీ పెరిగిందన్న ఆరోపణలకు బలం చేకూర్చే సంఘటన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో (Kovvur) వెలుగులోకి వచ్చింది. స్థానికంగా మద్యం (Liquor) దుకాణాల్లో ఎం.ఆర్.పి(MRP) కంటే అధిక ధరలకు విక్రయాలు (Higher Prices Sales) జరుగుతున్నాయని ప్రజలు ఫిర్యాదు చేయగా, జనసేన పట్టణ అధ్యక్షుడు డేగల రాము (Degala Ramu) స్వయంగా పరిశీలనకు వెళ్లిన సందర్భంలో షాపు నిర్వాహకులు నిబంధనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా స్పందించడం వివాదానికి దారి తీసింది.

ఈ విషయంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇప్పటికే అధిక ధరలకు మద్యం విక్రయాలు నిబంధనలకు విరుద్ధమని హెచ్చరించినప్పటికీ, క్షేత్ర స్థాయిలో ఆ ఆదేశాలు అమలు కావడం లేదన్న వాస్తవం ఈ ఘటన ద్వారా బయటపడింది. జనసేన నాయకులు ఎక్సైజ్ అధికారులను సంప్రదించినప్పటికీ తక్షణ చర్యలు తీసుకోకపోవడం మరింత విమర్శలకు తావిచ్చింది.

ఈ పరిణామాలతో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నదని, సాధారణ ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితి ప్రభుత్వ పెద్దలకు లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమిలో భాగమైన జనసేన నేతలు కూడా తమ గోడు వినిపించుకోలేకపోతున్నామన్న భావన వ్యక్తం చేస్తుండగా, ఈ పరిణామాలు జనసేన పార్టీ (Janasena Party) భవిష్యత్తుపై ఎలా చూపుతాయొ అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ దృఢ నిర్ణయం తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలతో పాటు ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment