తెలుగుదేశం (Telugu Desam Party)–జనసేన (Jana Sena Party) కూటమి (Alliance) అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు ఆశించిన విధంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోకపోయినా, చట్టసభల చరిత్రలో మాత్రం మరచిపోలేని ఒక చీకటి అధ్యాయానికి నాంది పలికిన తోలి పార్టీలుగా గుర్తింపు పొందాయి. ఈ ఇరు పార్టీల నేతలు పవిత్రమైన చట్టసభల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా జరిపిన కొన్ని సంఘటనలు ప్రజల్లో తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయి.
మొదటగా, పార్లమెంట్ చరిత్రలో (Parliament History) తొలిసారిగా ఒక ఎంపీ మాదకద్రవ్యాల వినియోగంలో పట్టుబడిన విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో సంబంధిత వ్యక్తి తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party) చెందిన ఎలూరు ఎంపీ(MP) కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యవహారంలో చిక్కుకోవడం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసినట్లయింది. తోలిసారిగా పట్టుబడిన ఎంపీ తెలుగుదేశం వ్యక్తి అవ్వడంతో తెలుగువారి ప్రతిష్ట దెబ్బతిన్నటైంది.
ఇంకొక ఘటనలో, శాసనసభను (Legislative Assembly) ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే నేపథ్యంలో, ఒక ఎమ్మెల్యే శాసనసభలో కూర్చుని అసభ్యకర వీడియో కాల్‌లో పాల్గొన్నట్లు బయటపడటం తీవ్ర ఆందోళన కలిగించింది. జనసేనకు(Jana Sena) చెందిన ఆ ఎమ్మెల్యే ప్రవర్తన శాసనసభ గౌరవాన్ని దిగజార్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా శాశన సభలో ఉంటూ అసభ్య వీడియొ కాల్ చేసిన చరిత్ర జనసేన పార్టీ సోంతం చేసుకుంది.
ఈ రెండు సంఘటనలు పార్లమెంట్ మరియు అసెంబ్లీ స్థాయిలో ప్రజాప్రతినిధుల ప్రవర్తనపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తాయి. ప్రజలు తమ ఓట్లతో ఎన్నుకున్న నాయకులు ఇలాంటి వ్యవహారాల్లో చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి అవమానంగా మారిందనే భావన విస్తృతంగా వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాజకీయ పార్టీలపై ఉందని ప్రజలు కోరుకుంటున్నారు.






