---Advertisement---

పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట.. కోర్టు బెయిల్ మంజూరు

March 18, 2026

Summarize with AI

---Advertisement---

ఉగాది పండుగ వేళ వైసీపీ (YSR Congress Party) శ్రేణుల్లో ఆనందం నెలకొంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి (Pinnelli Ramakrishna Reddy) న్యాయస్థానం ఊరట కలిగించింది. టీడీపీ నేతల జంట హత్యల కేసులో ఆయనకు గురజాల కోర్టు బెయిల్(Bail) మంజూరు చేసింది. దాదాపు 98 రోజులుగా నెల్లూరు సెంట్రల్ జైలులో (Central Jail) రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన, కోర్టు ఆదేశాలతో విడుదల కానున్నారు.

ఎన్నికల సమయంలో జరిగిన ఘటనల ఆధారంగా పిన్నెల్లిపై కేసులు నమోదు చేయడం రాజకీయ కక్ష సాధింపే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సరైన ఆధారాలు లేకపోయినా ఆయనను లక్ష్యంగా చేసుకుని జైలుకు పంపారని వారు విమర్శిస్తున్నారు. దాదాపు మూడు నెలల పాటు జైలులో గడిపిన పిన్నెల్లికి ఇప్పుడు బెయిల్ రావడంతో అభిమానులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో ఈ పరిణామం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment