---Advertisement---

తిరుమల లడ్డూ వివాదంలో ఆధారాలు లేకుండా మాట్లాడారంటు సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు.

March 19, 2026

---Advertisement---

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత నారా చంద్రబాబు నాయుడుకు (Nara Chandrababu Naidu) అత్యంత ఆప్తుడిగా పేరున్న సుజనా చౌదరి (Sujana Chowdary) ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. సీట్ల సర్ధుబాటులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ(BJP) తరపున గత ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన, తిరుమల (Tirumala) లడ్డూ కల్తీ (Laddu Adulteration) అంశంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒక ప్రముఖ టెలివిజన్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తిరుమల లడ్డూ వ్యవహారంలో జంతు కోవ్వు (Animal Fat), బాత్రూం క్లీనర్స్ వంటి పదార్థాలు కలిపారన్న ఆరోపణలపై స్పష్టమైన ఆధారాలు లేవని (Evidence Not Available) ఆయన పేర్కొన్నారు. సరైన నివేదికలు లేకుండానే ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన విమర్శించారు. ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan kalyan) బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని ఆయన తీవ్రంగా అభిప్రాయపడ్డారు.

ఇక మీడియాపైనా ఆయన ఘాటైన విమర్శలు చేశారు. కొంతమంది మీడియా సంస్థలు బాధ్యత లేకుండా ట్రయల్స్ నిర్వహిస్తూ, నిర్ధారణలు లేకుండానే వార్తలను ప్రచారం చేసి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు నేరుగా తెలుగుదేశం పార్టీ మరియు దానికి మద్దతు ఇస్తున్న మీడియాను లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ప్రభుత్వ (Government) కాలంలో తిరుమలలో ఏర్పాట్లు మెరుగ్గా ఉన్నాయని, సేవలు అభివృద్ధి చెందాయని సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలను కొందరు గుర్తుచేస్తున్నారు. ఆ సమయంలో తిరుమల పవిత్రతకు ఎటువంటి భంగం కలగలేదని ఆయన అభిప్రాయపడ్డారని చెబుతున్నారు. ఇప్పుడు అదే సుజనా చౌదరి, చంద్రబాబు వ్యవహార శైలిపై విమర్శలు చేయడం రాజకీయంగా కీలక పరిణామంగా మారిందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment