---Advertisement---

సినీ పెద్దలతో ఏపీ ప్రభుత్వానికి గ్యాప్ పెరిగిందా?

March 20, 2026

---Advertisement---

మాదాపూర్‌లోని (Madhapur) హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో (HITEX Convention Center) తెలంగాణ (Telangana) గద్దర్ ఫిల్మ్ అవార్డుల (Gaddar Film Awards) ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (Central Board of Film Certification) ద్వారా సర్టిఫికెట్ పొందిన చిత్రాలకు సంబంధించి ఇప్పటికే విజేతల వివరాలను ప్రకటించారు. వారందరికీ ప్రశంసాపత్రాలతో పాటు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.

ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవికు ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ (NTR National Award) ను రేవంత్ రెడ్డి (Revanth Reddy) అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులను గౌరవించిన తెలంగాణ ప్రభుత్వాన్ని చిరంజీవి అభినందిస్తూ, ఇదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును (AP CM Chandrababu Naidu) ఉద్దేశించి మాట్లాడారు.

తెలంగాణను స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లోనూ కళాకారులను ప్రోత్సహించాలని, అక్కడ కూడా అవార్డులను పునరుద్ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే ఆర్. నారాయణమూర్తి కూడా స్పందిస్తూ, “చంద్రబాబు గారూ… మీకు దండం పెడతాం, ఇండస్ట్రీని ప్రోత్సహించండి. దయచేసి ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులను (Nandi Awards) పునరుద్ధరించండి” అని కోరారు.

చిరంజీవి, ఆర్. నారాయణమూర్తి (R. Narayana Murthy) చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సినీ ఇండస్ట్రీకి గ్యాప్ పెరిగిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం సినీ పరిశ్రమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై సినీ ఇండస్ట్రీ పెద్దలే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరింత చర్చకు దారి తీసింది.

గతంలో, చిరంజీవి తమ్ముడు మరియు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా సినీ పరిశ్రమపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని ఆయన విమర్శించారు.

ఎన్‌డీఏ(NDA) కూటమి ప్రభుత్వం (Alliance Government) ఏర్పడి ఏడాది కావస్తున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదని ఆయన అన్నారు. తమ సినిమాల విడుదల సమయంలో మాత్రమే ప్రభుత్వం వద్దకు వస్తున్నారని, కానీ పరిశ్రమ అభివృద్ధి కోసం సంఘటితంగా ముందుకు రావడం లేదని విమర్శించారు. అందరూ కలసి రావాలని సూచించినా, సానుకూల స్పందన రాలేదని ఆయన పేర్కొన్నారు. అయితే, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత కూడా సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దగా స్పందన రాలేదు. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇచ్చినా, కొన్ని సందర్భాల్లో తేదీలు కుదరలేదని చెబుతూ ఆ అవకాశాలను వదిలేశారు.

మరోవైపు, జగన్ ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీని అవమానించారని రాజకీయ అవసరాల కోసం అసత్య ప్రచారం జరిగిందని, ఒక వర్గానికి తమను దూరం చేయాలనే కుట్ర నాడు జనసేన, తెలుగుదేశం పార్టీలు చేశాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు వీరితో సమాన దూరం పాటించకుండా దగ్గరగా ఉంటే, నాడు చేసిన ఆరోపణలే నిజమని ప్రజలు నమ్మే పరిస్థితి వస్తుందని, ఇది సినీ ఇండస్ట్రీ మనుగడకే ప్రమాదంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.

గత జగన్ ప్రభుత్వం సినీ పెద్దలను గౌరవంగా ఆహ్వానించి, వారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, విశాఖ వంటి నగరాల్లో ప్రైమ్ లోకేషన్లలో స్థలాలు ఇస్తామని, అక్కడ మరో జూబ్లీహిల్స్ నిర్మించమని కోరిందని కొరినట్టు కూడా చెబుతున్నారు.

అయితే రాజకీయ స్వలాభం కోసం కట్ అండ్ పేస్ట్ వీడియోలు, ఫోటోలతో జనసేన, తెలుగుదేశం పార్టీలు నాటి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేశాయని, దాంతో నష్టపోయింది సినీ ఇండస్ట్రీనేనని కొందరు అంటున్నారు. లాభపడింది మాత్రం కూటమి నేతలేనని విమర్శిస్తున్నారు.

ఈ సమయంలో ఇరు ప్రభుత్వాలకు సమాన దూరం పాటించాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీపై ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే దాన్ని మనసులో ఉంచుకుని సినీ ఇండస్ట్రీని చిన్నచూపు చూడటం, అవార్డులు ఇవ్వకుండా ఉండటం, కఠిన వైఖరి అవలంబించడం ప్రభుత్వానికి తగదని సినీ ఇండస్ట్రీలోని పలువురు పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment