అకాల వర్షాలతో పంటలు (Rains) నాశనమై రైతులు (Crops) తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిపై మాజీ మంత్రి శైలజానాథ్ (Shailajanath) ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను (Farmers) ఆదుకోవడంలో ప్రభుత్వం (Government) పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె, శింగనమల, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు మండలాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయని తెలిపారు.
నష్టపోయిన పంటలకు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్
నార్పల మండలంలోని ఒక గ్రామంలో వేలాది అరటి (Banana) మొక్కలు నాటగా, అకాల వర్షాల వల్ల పెద్ద ఎత్తున పంట నష్టపోయిందని ఆయన పేర్కొన్నారు. అలాగే శింగనమల ప్రాంతంలో విస్తీర్ణంగా ఉన్న మొక్కజొన్న, అరటి పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు.
మొక్కజొన్న పంటకు (Maize Crop) సరైన ధర (Proper Price) లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర ఉన్నప్పటికీ మార్కెట్లో తక్కువ ధరలకు కూడా కొనుగోలు చేయని పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. దీంతో రైతులు పండించిన పంటను ఇళ్ల దగ్గరే నిల్వ ఉంచుకుంటున్నారని చెప్పారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందించడంతో పాటు, తడిసిన పంటలను కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఎకరాకు తగిన ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతులకు న్యాయం జరగకపోతే వారి పక్షాన పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు.






