---Advertisement---

నోరు పారేసుకుంటున్న కూటమి నేతలు – వీరి సంస్కృతి మారదా?

March 22, 2026

---Advertisement---

రాజకీయ నేతలు అంటే సమాజంలో స్పూర్తిని నింపేవారిగా ఉండాలి. కానీ బజారు భాషను వాడకూడదు అనే ఇంగితం నేటి నేతల్లో కనిపించడం లేదనే అభిప్రాయం ప్రజల్లో రోజురోజుకు బలపడుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra Pradesh State) రాజకీయ నాయకులు వాడే భాష రోజురోజుకీ దిగజారిపోతుందనే భావన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సమాజంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం నేతలకు పరిపాటిగా మారింది.

త్వరగా గుర్తింపు పొందాలనే ఆత్రంతో, లేదా అసభ్యకరమైన భాషను వాడి తమ అధినేతల దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో, ప్రత్యర్థి వర్గంలోని నాయకులను స్థాయి మరిచి విమర్శించడం సమాజంలో విషబీజాలు నాటే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న కూటమి నేతలు (Ruling Alliance Leaders) ప్రతిపక్ష నాయకుడు జగన్ (Y. S. Jagan Mohan Reddy) కుటుంబాన్ని (Family) టార్గెట్ చేస్తూ అసభ్య పదజాలం వాడటం తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది.

గతంలో వైసీపీ సభ్యులు బూతులు మాట్లాడతారని ఆరోపణలు చేసిన రోజుల్లో కూడా, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ(TDP), జనసేన(Jana Sena) నాయకుల రెచ్చగొట్టే ధోరణే ఈ సంస్కృతికి బీజం వేసిందనే విమర్శలు ఉన్నాయి. మీడియా బలం తో వైసీపీ నాయకుల భాష సరిగా ఉండదనే అభిప్రాయం ప్రజల్లో కలిగేలా ప్రచారం చేసి, ఆ విషయంలో విజయం సాధించారని చెప్పవచ్చు.

అయితే, పరిపాలనలో లోపాలను ఎత్తిచూపలేకనే నాటి జగన్ ప్రభుత్వాన్ని, వైసీపీ అధినేత జగన్‌ను పట్టాభి లాంటి టీడీపీ నాయకులు అసభ్యకరమైన భాషతో విమర్శించారని, తిరిగి జగన్ అభిమానులు అదే స్థాయిలో ప్రతిస్పందిస్తే ఆ పార్టీని “బూతుల పార్టీ” (Party of Abuses)గా ముద్ర వేయడంలో కూడా విజయం సాధించారని చెప్పడంలో సందేహం లేదు.

అయితే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కూటమి నేతల తీరులో మార్పు కనిపించడం లేదు. పరిపాలనపై విమర్శలు వచ్చిన ప్రతిసారి ప్రజల దృష్టిని మళ్లించడానికి జగన్‌ను, రాజకీయాల్లో లేని భారతీ గారిని వ్యక్తిగతంగా దూషించడం పరిపాటిగా మారింది. ఈ విధమైన వ్యవహార శైలితో ప్రజా సమస్యలను చర్చించుకునే అవకాశాన్ని పక్కదారి పట్టించాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ కోవలోనే ప్రస్తుతం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhi Ram) ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై (Y. S. Jagan Mohan Reddy) మరోసారి వ్యక్తిగత దూషణలకు దిగగా, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి (Akepati Subhashini) రాజకీయాల్లో లేని భారతీ (Y. S. Bharathi) గారిపై అత్యంత జుగుప్సాకరమైన భాష వాడటం కూడా ఇదే ధోరణికి నిదర్శనం. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే కుట్రలో భాగమే అన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది.

తమ పార్టీ నాయకులు ఎవరినీ వ్యక్తిగతంగా దూషించరని చెప్పుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు(Nara Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇప్పుడు తమ పార్టీ నాయకులు వాడిన భాషపై ఎలా స్పందిస్తారు? ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వారిపై చర్యలు తీసుకుని తమ మాటకు కట్టుబడి ఉంటారా లేదా అన్నది చూడాలి. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే, ఈ బూతుల సంస్కృతిని పెంచి పోషిస్తున్నవారే వారన్న అభిప్రాయం ప్రజల్లో మరింత బలపడే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment