---Advertisement---

టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు పై పెరుగుతున్న ఒత్తిడి?

March 22, 2026

---Advertisement---

భగవద్గీతపై (Bhagavad Gita) చేసిన వ్యాఖ్యలతో, వ్యక్తిగత వీడియొలతో వివాదంలో చిక్కుకున్న టీటీడీ(TTD) చైర్మన్ బీఆర్ నాయుడు (B.R. Naidu) వ్యవహారం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్‌సీపీ(YSRCP) మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి (Varudu Kalyani) తీవ్ర స్థాయిలో స్పందిస్తూ, ఆయన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపించారు. తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసేలా పరిస్థితులు మారాయని, వివాదాస్పద అంశాలు బయటకు వచ్చినప్పటికీ ఆయనను పదవిలో కొనసాగించడం ఎందుకని ప్రశ్నించారు.

ఇక టీటీడీ వ్యవహారంపై సీపీఐ (CPI) నాయకుడు నారాయణ (Narayana) కూడా ఘాటుగా స్పందించారు. పవిత్రమైన ఆలయ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, వివాదాల్లో ఉన్న వ్యక్తులు కీలక పదవుల్లో కొనసాగడం తగదని అన్నారు. ఇదే సమయంలో ప్రపంచ రాజకీయాలపై కూడా ఆయన స్పందిస్తూ, యుద్ధాల ప్రభావం భారతదేశంపై తీవ్రంగా పడుతుందని హెచ్చరించారు.

మరోవైపు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) కూడా బీఆర్ నాయుడిపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై (Nara Chandrababu Naidu) తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుమల వంటి పవిత్రక్షేత్ర ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారు రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వివాదాల మధ్య బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మొత్తంగా చూస్తే, టీటీడీ చైర్మన్ వ్యవహారం రాజకీయ రంగంలోనే కాకుండా భక్తుల్లో కూడా చర్చకు దారితీస్తోంది. ఈ వివాదం ఎటు దారితీస్తుందో, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment