---Advertisement---

వ్యభిచారం కేసులో టీడీపీ నేత అరెస్ట్

March 22, 2026

---Advertisement---

రాష్ట్ర రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. వ్యభిచారం కేసులో టీడీపీకి చెందిన ఒక స్థానిక నాయకుడు పట్టుబడటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చిన్న బజార్ పోలీసుల దాడిలో సాయి లాడ్జిలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.

పోలీసుల రైడ్‌లో పట్టుబడిన వ్యక్తి చౌటపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు రావూరు రాధాకృష్ణమ నాయుడిగా గుర్తించారు. ఆయన స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి కావడం ఈ కేసుకు మరింత రాజకీయ ప్రాధాన్యతను తెచ్చింది.

2025 ఆగస్టులో సొసైటీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాధాకృష్ణమ నాయుడు అప్పటి నుంచి వివిధ వివాదాల్లో చిక్కుకుంటూ వస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. కాకుటూరు శివాలయ భూముల గురించి విలేకరుల సమావేశంలో టిడిపి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి గురించి అసభ్యకరంగా మాట్లాడారని పేర్కొంటూ రావూరు రాధాకృష్ణమ నాయుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా వి.సత్రం పోలీసులు కాకాణిపై కేసు నమోదు చేశారు.

ఇక వెంకటాచలం మండలంలో ఆయన ప్రభావం పెరగడంతో, స్థానిక రాజకీయ నాయకులు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పంచాయతీ అనుమతులు లేకుండా పనులు చేపట్టడం, అధికారులపై ఒత్తిడి తీసుకురావడం వంటి ఆరోపణలు కూడా వినిపించాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వ్యభిచారం కేసులో ఆయన పట్టుబడటం నెల్లూరు జిల్లాలో చర్చకు దారి తీస్తున్నది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment