---Advertisement---

పరిశ్రమల పట్ల పవన్ వ్యాఖ్యల్లో విశ్వసనీయత లోపించిందా?

March 24, 2026

---Advertisement---

గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు అప్పటి పాలకుల బెదిరింపుల కారణంగా వెనక్కి వెళ్లిపోయాయని, ప్రస్తుతం కూటమి పాలనలో పెట్టుబడులు స్వయంగా రాష్ట్రాన్ని వెతుక్కుంటూ వస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజం ఉందన్న అంశంపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతిపక్ష నాయకులు అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. 2014 నుంచే ఆయన పలుమార్లు అసత్య వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. సుగాలి ప్రీతి ఘటన నుంచి వాలంటీర్లపై (Volunteers) చేసిన ఆరోపణల వరకు ఆయన చెప్పిన విషయాల్లో నిజం లేదని వారు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం కూడా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు.

ఇక ప్రస్తుత కూటమి పాలనలో పరిశ్రమలు (Industries) వేదింపులు (Harassment) భరించలేక వెనక్కి తగ్గుతున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలపై రాజకీయ జోక్యం, స్థానిక నాయకుల ఒత్తిళ్లు, కాంట్రాక్టు వివాదాలు పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

వైఎస్ఆర్ కడప జిల్లాలో (YSR Kadapa District) జమ్మలమడుగు సమీపంలో ఆదానీ గ్రూప్ (Adani Group) నిర్మాణ పనుల సమయంలో జరిగిన ఉద్రిక్తతలు, అలాగే కృష్ణపట్నం పోర్ట్ (Krishnapatnam Port) కార్యకలాపాలపై వచ్చిన దాడుల ఆరోపణలు పారిశ్రామిక వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపాయని భావిస్తున్నారు. అనంతపురంలో కియా అనుబంధ పరిశ్రమలపై ఒత్తిళ్లు, శ్రీకాకుళంలో యునైటెడ్ బ్రువరీస్ యాజమాన్యంపై డబ్బు డిమాండ్లు, అనకాపల్లిలో కోకాకోలా ప్రతినిధులపై వేధింపుల ఆరోపణలు వంటి సంఘటనలు కూడా ఆందోళనకు కారణమయ్యాయి.

అదేవిధంగా పల్నాడు జిల్లాలో కొన్ని సిమెంట్ సంస్థలు ఉత్పత్తిని నిలిపివేసిన ఘటనలు కూడా రాష్ట్ర పరిశ్రమల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మరోవైపు గత ప్రభుత్వ కాలంలో ఒప్పందం కుదిరిన కొన్ని ప్రముఖ సంస్థలు ఇప్పుడు పెట్టుబడుల విషయంలో వెనక్కి తగ్గినట్లు ప్రకటించడం మరింత చర్చనీయాంశమైంది.

ప్రతిపక్షం వాదన ప్రకారం, గత జగన్ పాలనలో ప్రస్తుతం జరుగుతునట్టుగా పారిశ్రామికవేత్తలు వేదింపులపై ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదని, కేంద్రానికి ఫిర్యాదులు చేసిన ఉదాహరణలు కూడా లేవని చెబుతున్నారు. అలాగే కూటమి పాలనలో జరుగుతునట్టు బంధువర్గాలకు ప్రాజెక్టులు కట్టబెట్టిన ఘటనలు లేవని గుర్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పెట్టుబడులపై డిప్యుటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చేస్తున్న వాఖ్యల్లో వాస్తవం లేదని, ఆయన మాటల్లో రాజకీయ ఆరోపణలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రజలు సైతం చర్చించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రజల్లో పవన్ కళ్యాణ్ పట్ల విశ్వసనీయత గణనీయంగా తగ్గిపోతుందని చర్చ కూడా బలంగా జరగడం గమనార్హం.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment