---Advertisement---

అనకాపల్లి మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ పోరులో పెలవంగా కూటమి వాదన ?

March 26, 2026

---Advertisement---

అనకాపల్లి జిల్లాలో (Anakapalli District) ఆర్సెలార్ మిట్టల్–నిప్పన్ స్టీల్ ఇండియా (ArcelorMittal Nippon Steel India) స్టీల్ ప్లాంట్ (Steel Plant) శంకుస్థాపన చుట్టూ రాజకీయ వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన క్రెడిట్‌ను తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) తమదిగా ప్రకటిస్తుండగా, వైసీపీ (YSR Congress Party) మాత్రం దీనిని “క్రెడిట్ చోరీ” (Credit Theft)గా విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్(Nara Lokesh) చేసిన “జూమ్ కాల్ ద్వారా ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి వచ్చింది” అనే వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.

అయితే ఈ వాదనపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ స్థాయి పెట్టుబడి ప్రాజెక్టులు కేవలం ఒక వీడియో కాల్‌తో నిర్ణయించబడతాయా అనే ప్రశ్న ప్రజల్లో ప్రధానంగా వినిపిస్తోంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మాత్రం 2022లో తన దావోస్ పర్యటన సమయంలోనే ఆర్సెలార్ మిట్టల్ గ్రూప్‌తో (ArcelorMittal Group) చర్చలు జరిగాయని, రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దాదాపు అప్పుడే నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు.

అంతేకాకుండా, అదే సమయంలో గ్రీన్‌కో ప్రాజెక్టులో (Greenko Project) రూ.4,800 కోట్ల పెట్టుబడికి కూడా అవగాహన కుదిరిందని తెలిపారు. ఈ విషయాలకు బలం చేకూరుస్తూ మిట్టల్ కంపెనీ 2023-24 వార్షిక నివేదికలో ఇండియా ఈస్ట్ ప్రాంతంలో స్టీల్ ఉత్పత్తి విస్తరణపై స్పష్టమైన ప్రణాళికలు ఉన్నట్లు వెల్లడించబడింది.

విశాఖ పోర్ట్ టర్మినల్‌ను (Visakhapatnam Port Terminal) తమ పోర్ట్‌ఫోలియోలో చేర్చడం, పెల్లెట్ ప్లాంట్‌తో అనుసంధానం చేయడం వంటి నాటి అంశాలు కూడా ఈ విస్తరణకు పునాది అని అదే నివేదిక సూచిస్తోంది. దీనితో, విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ప్రణాళికలు 2022 నుంచే ప్రారంభమయ్యాయని స్పష్టంగా తేలుతుంది.

సాధారణంగా లక్షల కోట్ల పెట్టుబడులతో కూడిన ప్రాజెక్టులు సంవత్సరాల తరబడి అధ్యయనం, చర్చలు, ప్రణాళికల తర్వాతే అమలు దశకు వస్తాయి. అలాంటి ప్రాజెక్ట్ కేవలం రెండు నెలల్లోనే, ఒక జూమ్ కాల్ తర్వాత ముందుకు వచ్చిందని చెప్పడం ఎంతవరకు నమ్మదగినది అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఈ నేపథ్యంలో 2022 నుంచే జరిగిన గ్రౌండ్ వర్క్, దావోస్ సమావేశాల ప్రాధాన్యం, మరియు తరువాతి రాజకీయ ప్రచారం మధ్య ఉన్న వ్యత్యాసం రాష్ట్రంలో కొత్త చర్చలకు దారితీస్తోంది. అసలు ఈ ప్రాజెక్ట్ సాధనలో ఎవరి పాత్ర కీలకమో అన్నది ఇంకా స్పష్టతకు రాకపోయినా, క్రెడిట్ రాజకీయాలు మాత్రం మరింత వేడెక్కుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment