---Advertisement---

ప్రజలను ఆశ్చర్యపరిచిన చంద్రబాబు గారి గ్యాస్ వాఖ్యలు ?

April 2, 2026

---Advertisement---

చంద్రబాబు (Nara Chandrababu Naidu) గారు నిన్నటిరోజున ఉదయగిరిలో (Udayagiri) నిర్వహించిన పేదల సేవ కార్యక్రమంలో సభలో ప్రసంగిస్తూ, ఏపీలో (Andhra Pradesh) గ్యాస్ సిలిండర్‌తో (Gas Cylinder) వంట చేయవచ్చని నేనే చేశానని చెప్పుకోవడం రాష్ట్ర ప్రజలను ఒకరకంగా విశ్మయానికి గురిచేసింది. చంద్రబాబు గారి ప్రసంగం విన్న తర్వాత, 1999కి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసలు గ్యాస్ సిలిండర్లు వాడేవారు కాదా అని నెటిజన్లు ఆయనను ఎదురు ప్రశ్నిస్తున్నారు. కొందరు ఆయన మాటలను హాస్యాస్పదంగా చూస్తుంటే, తెలుగుదేశం అభిమానులు మాత్రం 1999లో దీపం పథకం తీసుకొచ్చింది చంద్రబాబు గారే కాదా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.

అయితే, తెలుగుదేశం వారు వేస్తున్న ప్రశ్నలకు కూడా నెటిజన్లు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో దేశంలో మొట్టమొదటి సిలిండర్ 1967లో మన హైదరాబాద్ (Hyderabad) ఆల్విన్ ఫ్యాక్టరీలో (Allwyn Factory) తయారైందని. ఆ ఫ్యాక్టరీ సేవల వల్ల దేశంలోని ప్రతి మూలకు సిలిండర్లు చేరాయని. ఆ ఆల్విన్ ఫ్యాక్టరీని మూసివేసిన బాబుగారు, ఇప్పుడు ఏపీలో గ్యాస్ సిలిండర్‌తో వంట చేయవచ్చని నేనే చేశానని చెప్పుకోవడం హాస్యాస్పదం కాదా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే, నాటి ఆ పథకంలోని లోపాలను మరోసారి సాక్ష్యాలతో చూపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రభుత్వ కోశాగారం ఖాళీగా ఉన్న ఈ సమయంలో ప్రజలకు సబ్సిడీలు ఇవ్వడం అవసరమా అని చంద్రబాబు గారు తన ‘మనసులో మాట’ పుస్తకంలో పేజీలు 31, 37, 137లో రాసుకున్నారు. దానికి అనుగుణంగానే రెండురూపాయల కిలో బియ్యం పథకాన్ని ఎత్తివేశారు, 50 రూపాయల హార్స్ పవర్ కరెంటును కూడా నిలిపివేశారు, మధ్యపాన నిషేధాన్ని ఎత్తివేశారు. ఇలాంటి చంద్రబాబు గారు దీపం పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారంటే దానికి ఏదైనా ఉద్దేశ్యం లేకుండా ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు.

మహిళా ఓటర్లను ఆకర్షించడానికి 1999 ఎన్నికలకు సరిగ్గా రెండు నెలల ముందు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని. అయితే, ప్రచారం మాత్రం అందరికీ ఉచిత గ్యాస్ కనెక్షన్లు అని చెప్పి, చివరికి డ్వాక్రా గ్రూప్ మహిళలకే పరిమితం చేశారని. ఆ తర్వాత రివాల్వింగ్ ఫండ్ పొందినవారే అర్హులు అంటూ మరో షరతు పెట్టారని. అంతటితో ఆగకుండా, ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేశామని చెప్పి, మహిళలకు సబ్సిడీ ద్వారా అందే కిరోసిన్‌ను తగ్గించారని. సుమారు 50 లక్షల లీటర్ల కిరోసిన్ కోత పెట్టడంతో అది అందుబాటులో లేక, సామాన్య మహిళలు బ్లాక్ మార్కెట్‌లో కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని. ఇది నాటి రాజకీయాలపై అవగాహన ఉన్న అందరికీ తెలిసిన విషయమే అని చెప్పుకోచ్చారు.

అలాగే, 1999-2000 బడ్జెట్‌లో ఈ పథకానికి నామమాత్రపు కేటాయింపులు కూడా చూపలేదని. ఇప్పుడు మూడు సిలిండర్ల పథకం మాదిరిగానే, నాడు కూడా ఇలా ఇచ్చామని చెప్పుకుని, 1999 ఎన్నికల ముందు మహిళా ఓటర్లకు గాలం వేసిన పథకమిదేనని. దీని అమలులో అనేక షరతులు ఉండటంతో, అదే మహిళలు 2004లో చంద్రబాబు గారిని ఓడించారని. నాడైనా నేడైనా చంద్రబాబు గారి పథకాలలో కట్టింగులు లేకుండా ఉండవని చెప్పడానికి ఈ దీపం పథకం కూడా ఒక ఉదాహరణగా నిలుస్తోందని. ఏది ఏమైనా, నిన్నటి సభలో ఏపీలో గ్యాస్ సిలిండర్‌తో వంట చేయవచ్చని నేనే చేశానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment