---Advertisement---

డప్పు కొడుతున్న వృద్దుడిపై చేయి చేసుకున్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న

April 3, 2026

---Advertisement---

నర్సీపట్నంలో (Narsipatnam) జరిగిన పండగ వేడుకల సంధర్భంగా ఊహించని వివాదానికి స్పీకర్ అయ్యన్న పాతృడు (Ayyanna Patrudu) తెరలేపారు. ఉత్సాహంగా డప్పు కొడుతున్న దళిత (Dalit) వృద్దుడుపై (Elderly man) అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రవర్తించిన తీరు తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజల సమక్షంలోనే భాస్కర్ రావుపై (Bhaskar Rao) చేయి చేసుకున్నట్లు వీడియొలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో , దళిత సంఘాల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.

గతంలో కూడా అయ్యన్న పాత్రుడు పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. పాలకొల్లు సభలో నాటి సీఎం జగన్ పై (Jagan) అనుచిత పదజాలం వాడినట్లు విమర్శలు ఎదుర్కొన్నారు. అలాగే విశాఖలో జరిగిన పర్యాటక దినోత్సవంలో చేసిన వ్యాఖ్యలు గిరిజన వర్గాల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి. అటవీ హక్కుల చట్టం (1/70 యాక్ట్) అభివృద్ధికి అడ్డంకి అని వ్యాఖ్యానించడం, ఆ చట్టాన్ని సడలించాలని సూచించడం ఆదివాసీల (Tribals) ఆగ్రహానికి కారణమైంది.

అధికారులు, పోలీసులపై తరచూ దురుసుగా మాట్లాడటం, అసభ్య పదజాలం వాడటం వంటి ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత గౌరవనీయమైన అసెంబ్లీ స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి ప్రవర్తనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజల ముందు ఇలాంటి ప్రవర్తన ఉంటే ఆ పదవికి గౌరవం నిలుస్తుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కనీసం పదవిలో ఉన్నంత కాలం అయినా హుందాగా వ్యవహరించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment