---Advertisement---

అమరావతి బిల్లుపై వైసీపీ ఎంపీలు ఫైర్.. 20 నిమిషాల బదులు 5 నిమిషాలే సమయం ఇచ్చారంటూ సుబ్బారెడ్డి ఆరోపణలు

April 3, 2026

---Advertisement---

అమరావతికి (Amaravati) వైసీపీ (YSRCP) వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో జరుగుతున్న దోపిడీకి మరియు రైతులకు జరుగుతున్న అన్యాయానికి మాత్రమే వ్యతిరేకమని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి (Y. V. Subba Reddy) స్పష్టం చేశారు. అమరావతి ప్రస్తుత బిల్లుకే తమ వ్యతిరేకత అని వెల్లడించారు.

రాజ్యసభలో సమయం కోత.. గొంతు నొక్కారన్న ఆరోపణ

ఢిల్లీ లో మీడియాతో మాట్లాడిన సుబ్బారెడ్డి, రాజ్యసభలో (Rajya Sabha) అమరావతి బిల్లుపై (Bill) చర్చ సందర్భంగా తమ పార్టీకి తగిన సమయం ఇవ్వలేదని ఆరోపించారు. రాజ్యసభలో తమకు 7 మంది ఎంపీలు ఉన్నప్పటికీ 20 నిమిషాల సమయం ఇవ్వాల్సిందిపోయి కేవలం 5 నిమిషాలే ఇచ్చి మైక్ కట్ చేశారని చెప్పారు. ఇతర పార్టీలకు, ముఖ్యంగా టీడీపీకి(TDP) ఎక్కువ సమయం కేటాయించారని విమర్శించారు.

తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం వల్ల మిగిలిపోయిన ప్రసంగాన్ని రికార్డుల్లోకి తీసుకుంటామని ఉపరాష్ట్రపతి(Vice President) హామీ ఇచ్చారని తెలిపారు. అమరావతికి వ్యతిరేకం కాదని, కానీ ఈ బిల్లులో రైతులకు (Farmers) న్యాయం చేసే విధానాలు స్పష్టంగా లేవని అన్నారు. రాజధాని కోసం సుమారు 50,000 ఎకరాలు తీసుకుని 29,000 మంది రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

అమరావతి పేరుతో అవినీతి ఆరోపణలు

అమరావతి నిర్మాణం పేరుతో భారీ స్థాయిలో అవినీతి (Corruption) జరుగుతోందని సుబ్బారెడ్డి ఆరోపించారు. స్క్వేర్ ఫీట్‌కు (Square Foot) ₹14,000 వరకు ఖర్చు చేయడం అన్యాయమని, ప్రపంచంలో ఎక్కడా ఇంత అధిక వ్యయం లేదని పేర్కొన్నారు. ఇది ప్రజా ధనాన్ని దోచుకోవడమేనని విమర్శించారు.

కోల్‌కతా, బెంగళూరు, చెన్నై నగరాలతో పోల్చుతూ నిర్మాణ వ్యయంపై ప్రశ్నలు లేవనెత్తారు. రాజ్యసభ గ్యాలరీలో (Rajya Sabha Gallery) టీడీపీ(TDP) నేతలను టీవీలో చూపించడం నిబంధనలకు విరుద్ధమని, గ్యాలరీ ఫోటోలు పత్రికల్లో ప్రచురించడంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment