---Advertisement---

విఫల ప్రయొగం ఇజ్రాయెల్ టెక్నాలజీ వ్యవసాయం ఒక సంచలనం అంటూ టీడీపీ వింత వాదన

April 6, 2026

Summarize with AI

---Advertisement---

90వ దశకంలో ఇజ్రాయెల్ టెక్నాలజీతో (Israel Technology వ్యవసాయం (Agriculture) భారతదేశంలో (India) ఒక సంచలనంగా మారింది. ఆ సంచలనానికి కారణం చంద్రబాబు గారేనని తాజాగా టీడీపీ(TDP) వాదిస్తోంది. కుప్పంలో వెనుకబాటుతనాన్ని పోగొట్టడానికి, నీటి పొదుపు కోసం ఇజ్రాయెల్ సాంకేతికతను చంద్రబాబు (Nara Chandrababu Naidu) తీసుకువచ్చారని చెబుతున్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంట పండించే విధానం దేశాన్ని ఆకర్షించిందని పేర్కొంటున్నారు. అయితే ఈ వాదనపై కుప్పం ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

1999లో భూసారాన్ని బట్టి సంప్రదాయ పంటలు పండిస్తున్న కుప్పం (Kuppam) నియోజకవర్గ రైతులకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధునిక వ్యవసాయాన్ని ప్రవేశపెడతామని తెలిపారు. ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం అంటూ ప్రచారం చేసి, మధ్యలోనే ప్రాజెక్టును వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల చాలామంది రైతులు నష్టపోయారని అంటున్నారు. ఈ విషయాలు కొత్త తరానికి తెలియకపోయినా, అప్పట్లో నష్టపోయిన రైతులకు బాగా తెలుసు.

కుప్పం నియోజకవర్గంలో 1999లో ఇజ్రాయెల్ ఆధునిక వ్యవసాయ విధానాలను (Israel Modern Farming Methods) పరిచయం చేశారు. పంటలకు అవసరమైనంత నీటిని మాత్రమే ఉపయోగించే డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. ఈ క్రమంలో రామకుప్పం మండలంలోని చెల్దిగానిపల్లె వద్ద 200 ఎకరాల్లో డెమో ప్రాజెక్ట్ ప్రారంభించారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా తక్కువ నీరు, ఆధునిక పరికరాలు, సమర్థవంతమైన భూమి వినియోగంతో అధిక దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. జపాన్ గ్రాంట్‌గా వచ్చిన రూ.10 కోట్లతో 1,600 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్‌ను విస్తరించారు. అనంతరం కుప్పం, రామకుప్పం, గుడుపల్లె, వి.కోట మండలాల్లో 10,000 ఎకరాలకు విస్తరణకు చర్యలు తీసుకున్నారు.

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రైతుల భూమి పత్రాలను బ్యాంకుల్లో తనఖా పెట్టించి రుణాలు ఇప్పించారు. అయితే రైతులకు నాసిరకమైన సబ్సిడీ పరికరాలు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. పంటలు ఆశించిన లాభాలు ఇవ్వకపోవడంతో రైతులు నష్టపోయారు. అప్పులు తీర్చలేక భూముల పత్రాలు విడిపించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాక, ఈ సాంకేతికత వల్ల భూసారం తగ్గిందని కొందరు రైతులు ఇప్పటికీ అంటున్నారు.

ఇక రైతులకు పదేళ్ల పాటు సాంకేతిక సహాయం అందిస్తామని చెప్పిన బీహెచ్‌సీ (బ్రైట్ హషిత కంపెనీ) మధ్యలోనే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఈ సంస్థ చంద్రబాబు బినామీలదేనని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ కంపెనీకి ఏటా రూ.2.80 కోట్ల కన్సల్టెన్సీ ఫీజు చెల్లించారని, 2004లో కూడా రూ.1.50 కోట్లను విడుదల చేశారని విమర్శలు ఉన్నాయి.

హైదరాబాద్‌ ఐఎంజీ భూముల కుంభకోణంలో ప్రధానంగా పేర్లు వినిపించిన ఢిల్లీరావు, పేట్రావ్‌లకు చెందినదే ఈ బీహెచ్‌సీ అనే వాదన ఉంది. ఆఫ్రో-ఏషియన్ గేమ్స్ క్రీడల నిర్వహణకు కన్సల్టెంట్‌గా వ్యవహరించడానికి ఈ సంస్థకు కాంట్రాక్టు ఇవ్వబడింది. దీని కోసం రూ. 1.11 కోట్ల కన్సల్టెన్సీ ఫీజును ఖరారు చేశారు.

రైతులు నష్టాల్లో ఉన్న సమయంలో ఈ సంస్థ ప్రాజెక్ట్‌ను వదిలేసింది. డ్రిప్ ఇరిగేషన్ అమలుకు భూములు సేకరించి, రైతులకు సరైన చెల్లింపులు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. మొదట ఎకరాకు రూ.1 లక్ష ఇస్తామని చెప్పి, తరువాత రూ.17,000 మాత్రమే ఇస్తామని తగ్గించారు. చివరికి ఆ మొత్తాన్ని కూడా చెల్లించలేదని రైతులు ఆరోపించారు.

పదేళ్లు కొనసాగుతామని చెప్పిన ప్రాజెక్ట్ ముందుగానే ఆగిపోయింది. ఈ వ్యవహారంపై 2006లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చలపతి కమిషన్‌ను నియమించారు. ఆ కమిషన్ నివేదికలో అనేక అవకతవకలు బయటపడ్డాయని చెబుతారు. అయితే ఆ నివేదిక అమలు కాకుండా వ్యవస్థలను ఉపయోగించబడ్డాయనే ప్రచారము ఉంది. ఇది బాబు గారి ఇజ్రాయిల్ టెక్నాలజీ కధ.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment