ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం (Government) మరియు ప్రతిపక్షాల మధ్య జరిగే చర్చలు విధానాల చుట్టూనే పరిమితమవడం ఆరోగ్యకరమైన పరిపాలనకు ముఖ్య సూచికగా భావించబడుతుంది. అదే సమయంలో ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా గుర్తింపు పొందిన మీడియా, ఈ చర్చలను నిష్పాక్షికంగా విశ్లేషించి ప్రజలకు లాభనష్టాలను స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యత కలిగి ఉంటుంది.
అయితే ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మీడియా వ్యవస్థ (Media System) ఈ ప్రమాణాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం రోజురోజుకీ బలపడుతోంది. తెలుగుదేశం (Telugu Desam Party) అజమాయిషీలో ఈనాడు (Eenadu) ఆంధ్రజ్యోతి (Andhra Jyothi) వంటి ప్రధాన పత్రికలు వెళ్ళిపోయాయక నానాణికి రెండో కోణం ప్రజలకి తెలియపర్చడం కోసం సాక్షీ ఆవిర్భవించింది. దీంతో రెండు ప్రధాన పార్టీలకి మీడియా బలం ఉందనేది స్పష్టం.
ఆధునిక రాజకీయాల్లో మీడియా మద్దతు సాధారణమైన అంశమే అయినప్పటికీ, అది ఆంధ్రజ్యోతిలా హద్దులు దాటి అసత్య ప్రచారాలు చేయడం లేదా వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారుతుంది. ముఖ్యంగా విధానాలపై చర్చ జరగాల్సిన సందర్భాల్లో వ్యక్తిగత విమర్శలు, ఆంధ్రజ్యోతిలా కుటుంబాలపై వ్యాఖ్యలు చేయడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ఇటీవలి పరిణామాలు చూస్తే, తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికే మీడియా సంస్థలు విధానాలపై విమర్శలు చేయాల్సిన బాధ్యతను పక్కనబెట్టి జగన్ (Y. S. Jagan Mohan Reddy) లాంటి రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు దిగుతున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర రాజధానిగా అమరావతి మేలా, మావిగన్ ప్రతిపాధన మంచిదా అనే అభివృద్ధి ప్రణాళికలపై సమగ్ర చర్చ జరగాల్సిన సందర్భాల్లో, ఆంధ్రజ్యోతి వ్యక్తిగత విమర్శలతో ముందుకు రావడం ప్రజాస్వామ్య సంస్కృతిని దెబ్బతీస్తోంది.
ప్రజాస్వామ్యంలో వాదోపవాదాలు సహజమే అయినప్పటికీ, అవి మర్యాదపూర్వకంగా మరియు విధానాల పరంగా మాత్రమే కొనసాగాలని. అసభ్యకరమైన వాఖ్యలతో దాడులకి దిగే ఆంధ్రజ్యోతి లాంటి మీడియా సంస్థలు ఉగ్రవాద సంస్థలను పోలిన కార్యాచరణకు దిగడం క్షమార్హం కాదని, తక్షణం కేబుల్ టీవీ నెట్ వర్క్ చట్టానికి వ్యతిరేకంగా ఉన్న ఇలాంటి సంస్థపై కెంద్రం చర్యలు తీసుకుని ప్రజాస్వామ్య వ్యవస్థకి భంగం కలగనీయకుండా చూడాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.





