---Advertisement---

ప్రైవేట్ వీడియోలు తొలగించాలని.. హైకోర్టును ఆశ్రయించిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్

April 7, 2026

---Advertisement---

రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కంటెంట్ ప్రసారం అవుతోందని ఆరోపిస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

వీడియోలు తొలగించాలంటూ కోర్టులో పిటిషన్

టీవీ, డిజిటల్, సోషల్ మీడియా వేదికల్లో ప్రసారం అవుతున్న వీడియోలు, ఫోటోలు వెంటనే తొలగించాలని అరవ శ్రీధర్ తన పిటిషన్‌లో కోరారు. అలాగే హర్షవీణ అనే మహిళ అందించిన కంటెంట్‌ను భవిష్యత్తులో మళ్లీ అప్‌లోడ్ చేయకుండా, ప్రసారం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.

హైకోర్టులో ఈ పిటిషన్ విచారణకు రాగా, ఎమ్మెల్యే తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్ గోప్యత హక్కు ఉల్లంఘనకు గురవుతోందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. వ్యక్తిగత వీడియోలను ప్రసారం చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.

ఈ అంశాన్ని పరిశీలించిన న్యాయస్థానం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని రైల్వేకోడూరు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 20 తేదీకి వాయిదా వేసింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment