---Advertisement---

మందకృష్ణ – పవన్ కళ్యాణ్ – వైయస్సార్సీపీ – అయినా మారని ఆంధ్రజ్యోతి తీరు.

April 7, 2026

---Advertisement---

చంద్రబాబు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండటానికి ఎంతకైనా దిగజారుతామనే స్థాయిలో ఆంధ్రజ్యోతి వ్యవహార శైలి ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు గారి విధానాలను ప్రశ్నించే వారి ఇళ్లలో మహిళలను కూడా నీచంగా మాట్లాడటం, రాధాకృష్ణ దిగజారుడు రాజకీయానికి పరాకాష్టగా రాష్ట్రంలోని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది.

భారత రాజ్యాంగం ప్రకారం, ప్రభుత్వాలు తీసుకునే విధానాలపై ప్రజాస్వామ్యబద్ధంగా అభిప్రాయం చెప్పడం, వాటికి విరుద్ధంగా సూచనలు ఇవ్వడం ప్రతి పౌరుడికి ఉన్న హక్కు. ఆ హక్కును కాలరాసేలా, చంద్రబాబు గారి విధానాలను ప్రశ్నిస్తే వారిని “అభివృద్ధి నిరోధకులు” అంటూ ముద్ర వేయడం మాత్రమే కాకుండా, ఇప్పుడు ఆ పైత్యం పరాకాష్టకు చేరి ప్రశ్నించే వారి ఇంటి మహిళలపై బూతు ప్రచారం చేయడం రాధాకృష్ణలాంటి జర్నలిజానికి ఉదాహరణగా ప్రజలు మండిపడుతున్నారు.

రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై రాజ్యాంగం ఇచ్చిన హక్కులను వినియోగించుకుని వైసీపీ శాంతియుత నిరసనను హైదరాబాద్‌లోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు నిర్వహించడం శుభపరిణామంగా చూడాలి. వైసీపీ ఎక్కడా గీత దాటకుండా శాంతియుతంగా నిరసన చేపట్టి తమ హక్కులను నిలబెట్టుకోవడం ఆహ్వానించదగ్గ విషయం.

అయితే, ఆ నిరసనను కూడా “దాడి”గా చూపిస్తూ మరోసారి ఆంధ్రజ్యోతి యాజమాన్యం తమ వైఖరిని ప్రదర్శించడం, వారి వికృత విధానంలో మార్పు రాలేదని సూచిస్తోంది. ఇలాంటి ఆలోచన తీరు ఉండడం వల్లే ఆంధ్రజ్యోతిపై సమాజంలో ఎప్పటికప్పుడు నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

2008లో జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆంధ్రజ్యోతి కార్యాలయంపై సుమారు 50 మంది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) కార్యకర్తలు దాడి చేశారు. దీనికి కారణం, పత్రికలో కొంతమంది దళిత నాయకుల ప్రస్తావన చేస్తూ, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారిని అవమానకరంగా చిత్రీకరించడం. ఆగ్రహంతో కార్యకర్తలు గాజు తలుపులను ధ్వంసం చేసి, కార్యాలయం ముందు పార్క్ చేసిన కార్లను పగలగొట్టారు. రిసెప్షన్ వద్ద పెట్రోల్ పోసి నిప్పంటించి, లోపలికి చొచ్చుకెళ్లి రాళ్లు, పెట్రోల్ బాటిళ్లు విసిరారు.

2018లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనను టార్గెట్ చేసే క్రమంలో, తన తల్లిని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ధూషించిందని సోషల్ మీడియాలో ఆరోపించారు. అనంతరం ఫిలిం చాంబర్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఆంధ్రజ్యోతి ఓబీ వాన్‌పై రాళ్లు వేసి దాడి చేసి, వాహనం అద్దాలు, కిటికీలు ధ్వంసం చేశారు. సిబ్బందిపై కూడా దాడి చేశారు.

ఇక తాజాగా, వైసీపీ నాయకుల ఇళ్లలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినప్పటికీ, గత ఘటనల మాదిరిగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా, వైసీపీ నాయకులు శాంతియుత నిరసన చేపట్టడం హర్షించదగ్గ అంశం.

చేతిలో పత్రిక ఉందని తప్పుడు వార్తలు ప్రచారం చేయడం, ఒక రాజకీయ పార్టీని పూర్తిగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో కుట్రపూరిత కథనాలు రాయడం జర్నలిజం విలువలకు విరుద్ధం. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నప్పటికీ, ఆ పత్రికపై సరైన చర్యలు తీసుకోకపోవడం కూడా ఆందోళన కలిగించే విషయం.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment