---Advertisement---

పవన్ కళ్యాణ్ తీరుపై జనసేన కార్యకర్తల ఆవేదన?

April 7, 2026

---Advertisement---

పవన్ కళ్యాణ్ నాయకత్వంపై జనసేన కార్యకర్తల్లో పెరుగుతున్న అసంతృప్తి ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అధికారంలోకి వస్తే తమ పరిస్థితులు మెరుగవుతాయని ఆశించిన పార్టీ క్యాడర్‌కు, ఇటీవల తీసుకున్న నిర్ణయాలు తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి. కూటమి రాజకీయాల్లో భాగంగా తమకు రావాల్సిన అవకాశాలు తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం కారణంగా తగ్గుతున్నాయనే భావన కార్యకర్తల్లో బలపడుతోంది. ఈ పరిస్థితిపై అధినేత స్పందించకపోవడం, వారి మనోభావాలను మరింత దెబ్బతీస్తోంది.

ఇదిలా ఉండగా, అనేక ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలపై దాడులు, హత్యలు, హత్యాయత్నాలు చోటుచేసుకున్నప్పటికీ, వాటిపై సరైన స్పందన రాకపోవడం నాయకత్వంపై నమ్మకాన్ని కదిలిస్తోంది. కొవ్వూరు, సత్తెనపల్లి, శ్రీకాకుళం, పాతపట్నం, నూజివీడు, మార్కాపురం, దారకానిపాడు వంటి ప్రాంతాల్లో జరిగిన ఘటనలు క్యాడర్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

మరోవైపు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై జరిగిన వ్యాఖ్యల విషయంలో రాధాకృష్ణకు మద్దతుగా స్పందించడం, గతంలో అదే మీడియా సంస్థపై ఇదే పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలను కార్యకర్తలు గుర్తుచేసుకుంటున్నారు. ఆంధ్రజ్యోతి వ్యవహారంపై ద్వంద్వ వైఖరి ఉన్నట్టుగా కనిపించడం, పార్టీ శ్రేణుల్లో అయోమయాన్ని పెంచుతోంది.

ఈ పరిణామాల మధ్య, తమకు గౌరవం, ప్రాధాన్యం లభించడం లేదనే భావన కార్యకర్తల్లో బలపడుతోంది. అధినేత నిర్ణయాలు కూటమి భాగస్వామ్యానికి మాత్రమే పరిమితమవుతున్నాయా? ఇది పార్టీ భవిష్యత్తు దిశలో కొలుకొలేని దెబ్బ తీస్తుందా అన్న ప్రశ్నలు ఇప్పుడు జనసేనలో తీవ్ర చర్చనీయంశంగా మారుతుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment