మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సంవత్సరం తాను పాదయాత్ర (Padayatra) ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రజలతో నేరుగా కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటానని తెలిపారు. పాదయాత్ర మొదలైన తర్వాత పార్టీ శ్రేణులు (Party Cadre) ప్రతి రోజూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు (Nara Chandrababu Naidu) “సినిమా చూపిస్తాయి” (Show Cinema) అంటూ ఘాటుగా స్పందించారు.
రాజధాని, అమరావతి అంశాలపై జగన్ విమర్శలు
రాయలసీమ (Rayalaseema) లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను (Lift Irrigation Project) ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని జగన్ ఆరోపించారు. ప్రజల కోసం పార్టీ శ్రేణులు పోరాటం చేస్తున్నారని, వారి కృషిపై గర్వంగా ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఇప్పటికే ఐదేళ్లలో సగం గడిచిపోయిందని, అయినా రాజధాని అంశంలో స్పష్టత రాలేదని విమర్శించారు.
అమరావతి (Amaravati) పేరుతో రైతులను (Farmers) మోసం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఒక ఎకరానికి కనీస సదుపాయాలకే భారీ ఖర్చు అవసరమవుతుందని, మొత్తం ప్రాజెక్ట్ వ్యయం లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని తెలిపారు. ఇంత భారీ వ్యయంతో రాజధాని నిర్మాణం(Capital Construction) సాధ్యమా అని ప్రశ్నించారు.
రాష్ట్ర అభివృద్ధికి తాము ప్రత్యామ్నాయ ప్రణాళికలు సూచించామని జగన్ చెప్పారు. విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని, అమరావతి శాసన రాజధానిగా ఉండే విధంగా ప్రణాళిక రూపొందించామని గుర్తు చేశారు. అలాగే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి గ్రోత్ కారిడార్‌గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించామని తెలిపారు.
తక్కువ ఖర్చుతో వేగంగా రాజధాని నిర్మాణం సాధ్యమని, భారీ ఆర్థిక భారాన్ని రాష్ట్రంపై మోపకూడదని జగన్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్రతిపాదనలను పక్కనబెట్టి అమరావతిపైనే దృష్టి పెట్టడం వెనుక కాంట్రాక్టులు, కమిషన్ల కోసమేనని ఆయన ఆరోపించారు. అమరావతి అవినీతికి కేంద్రంగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.






