ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని నిర్మాణంపై (Capital Construction) మరోసారి తీవ్రమైన రాజకీయ చర్చకు దారి తీసింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ప్రతిపాదించిన “మావిగన్” (MAVIGAN) (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు కారిడార్) మోడల్. జీవో 141 ప్రకారం 29 గ్రామాల్లో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కోర్ క్యాపిటల్ (Core Capital) నిర్మాణం చేపట్టడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన భారం మోపుతుందని జగన్ విశ్లేషించారు.
ఆయన వాదన ప్రకారం, ఈ ప్రాంతాల్లో సేకరించిన భూముల్లో కనీస మౌలిక సదుపాయాలే లేవు. రోడ్లు (Roads), డ్రైనేజీ (Drainage), విద్యుత్ (Electricity) వంటి ప్రాథమిక సదుపాయాల ఏర్పాటుకు ఒక్క ఎకరాకు సుమారు రెండు కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ప్రభుత్వ అంచనాలే సూచిస్తున్నాయి. ఈ లెక్కన లక్ష ఎకరాల అభివృద్ధికి సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతుందని ఆయన పేర్కొన్నారు. అప్పులు తెచ్చి ఈ స్థాయిలో ఖర్చు చేయడం రాష్ట్ర ఆర్థిక స్థితిని మరింత దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ఇక మావిగన్ మోడల్ విషయంలో, ఇప్పటికే అభివృద్ధి చెందిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానించి కారిడార్ రూపంలో అభివృద్ధి చేస్తే తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో సమర్థవంతమైన రాజధాని నిర్మాణం సాధ్యమవుతుందని జగన్ (Y. S. Jagan Mohan Reddy) అభిప్రాయపడ్డారు. సుమారు ఇరవై వేల కోట్ల వ్యయంతో అవసరమైన మౌలిక సదుపాయాలు కలిగిన రాజధానిని నిర్మించవచ్చని ఆయన విశ్లేషించారు.
అయితే, ఈ ప్రతిపాదనపై అధికార పక్షం మరియు వారి అనుబంధ వర్గాల నుంచి వచ్చిన ప్రతిస్పందనలు ప్రధానంగా వ్యక్తిగత విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలకే పరిమితమయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మావిగన్ అనే పదానికి డిక్షనరీలో అర్థమే లేదని వ్యాఖ్యానించగా, నారా లోకేష్(Nara Lokesh) దానిని వ్యంగ్యంగా విభజించి విమర్శించారు. కొన్ని మీడియా ప్రతినిధులు కుటుంభాల్లో మహిళలను దూషించారు. కొందరు రాజకీయ నాయకులు కూడా ఈ ప్రతిపాదనపై గణాంకాలు లేదా విశ్లేషణలతో స్పందించకుండా వ్యక్తిగత విమర్శలకు మాత్రమే పరిమితమయ్యారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే—రాజధాని నిర్మాణం వంటి కీలక అంశంపై రాజకీయ నాయకులు గణాంకాలు, ఆర్థిక విశ్లేషణలు, భౌగోళిక ప్రయోజనాలు వంటి అంశాలను ప్రస్తావించాల్సిన అవసరం లేదా? మావిగన్ మోడల్ కన్నా అమరావతి ప్రాజెక్ట్‌నే కొనసాగించడంపై స్పష్టమైన గణాంకాలతో కూడన జవాబు కూటమి నుండి ఎందుకు రావడంలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న చర్చలలో వాస్తవాల కంటే విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యం లభించడం ఆందోళనకరంగా కనిపిస్తోంది. ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాల విషయంలో భావోద్వేగాలు కాదు, గణాంకాలు మరియు సుస్థిర ప్రణాళికలే కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశను నిర్ణయించే ఈ అంశంపై సమగ్ర చర్చ జరగడం మేలని వారు డిమాండ్ చేస్తున్నారు.







