అదుపుతప్పిన అక్షరాలను మోస్తున్న రాధాకృష్ణకి “అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా” అనే సామెత సరిగ్గా సరిపోతుంది. పెన్నులో సిరా బదులు కాలకూటం నింపి రాసిన రాతలకు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల నుంచి చీత్కారం ఎదురయ్యే సరికి, తానొక పునీత చక్రవర్తినని తనకు తానే సమర్థించుకునే నేటి రాతలు మరింత రోతగా ఉన్నాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
రాధాకృష్ణ రాతల్లో బూతులను ఉపమానాలుగా చూపించడం, భయపడుతూనే బెదిరింపు ధోరణి ప్రదర్శించడం చూస్తున్న వారు — తప్పుడు అక్షరాలకు తలకట్టులు తీసేస్తే అవి మరింత బూతులే అవుతాయి కానీ బాధ్యత గల రాతలుగా మారవు కదా — అని పత్రికా సమాజం నుంచి వినిపిస్తున్న మాట. అయినా “తాను కిందపడలేదు, అదోక లయ” అంటూ తన రాతల్లో డొల్లతనాన్ని మరోసారి బయటపెట్టుకున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ — ఇది స్పష్టంగా కనిపిస్తున్న సత్యం.
ఒక మంచంలోని నల్లి ఆ మంచాన్ని తన సామ్రాజ్యంగా భావిస్తూ, ఆ మంచంపై ఎవరు ఆసీనులైనా తనతో తలపడాల్సిందే అన్నంత పోగరుగా ఉండటం ఆ నల్లి గొప్పతనమో, అమాయకత్వమో రాధాకృష్ణ లాంటి మేధావులకు తెలియని విషయం కాదు. ఆయన పలుకుల్లోని గంభీరత కూడా ఇలాగే ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వైఎస్సార్‌తో తలపడ్డానని పదేపదే చెప్పుకోవడం చూస్తే — ఆయన శిఖరం లాంటి వ్యక్తిగా మీ ముందున్నారని ఇప్పటికీ తలుచుకోవడం సంతోషమే అయినా — అదే వైఎస్సార్ మిమ్మల్ని పై చెప్పిన సామెతలా భావించి ఉండొచ్చని గ్రహించలేకపోవడం రాధాకృష్ణ అవివేకం అనడంలో అతిశయోక్తి లేదు.
ఒక కుటుంబానికి వ్యతిరేకంగా పత్రిక, చానల్‌లలో వార్తలు ప్రసారం చేసుకుంటూ జీవించే రాధాకృష్ణ లాంటి వ్యక్తులు సమాజంలో పెద్దమనుషులుగా ఊహించుకోవడం వారి భావదారిద్ర్యానికి నిదర్శనం. నారా లోకేష్ “రెడ్ బుక్” రాజకీయాన్ని ప్రోత్సహించి భుజాన మోసినప్పుడే, రేపటి రోజున ఇదే సంస్కృతి తన మెడవరకు వచ్చి చుట్టుకునే ప్రమాదం ఉందని ఆలోచించి ఉంటే, మీ మాటలకు, చేష్టలకు విలువ ఉండేదేమో అని ప్రజల నుంచి వినిపిస్తున్న మాట.
మహిళలను తిట్టే సంస్కృతిపై లెక్చర్లు ఇచ్చే రాధాకృష్ణ, తన చానల్‌లోనే — రామారావు గారిని చంద్రబాబు ఎలా దూషించారో దేవినేని నెహ్రూ చెప్పిన విషయాలు, అదే రామారావు గారు నన్నపనేని రాజకుమారి గారిని అసెంబ్లీలో అన్న ముతక మాటలు, నారా లోకేష్ జగన్‌పై చేసిన లండన్ ము** వ్యాఖ్యలు — ఇవన్నీ ఆశీర్వాదాలా? అని చెప్పాల్సిన బాధ్యత పత్రికాధిపతిగా లేదూ?
ఇదే సమయంలో, తెలుగుదేశం సభ్యులు పార్టీ కార్యాలయంలో కూర్చొని ముఖ్యమంత్రిని “బోసడికే” అని దూషించిన రోజున, వాటిని ఖండించాల్సింది పోయి అది బూతే కాదని సమర్థించినప్పుడు — తమలోని మహిళా ఉద్ధారకుడు ఎటుపోయాడో అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కుటుంబాల్లో స్పర్ధలు సహజం. చంద్రబాబు గారితో రామారావు గారు విభేదించారు, హరికృష్ణ విభేదించారు, పురందేశ్వరీ విభేదించారు, రామూర్తి నాయుడు విభేదించారు. బాలకృష్ణ ఇంట కాల్పులు జరిగితే వైఎస్సార్ చేసిన సహాయాన్ని మర్చిపోయి, జగన్ ఇంట జరిగిన విషయాలను మాత్రం ఊరు వాడా ప్రచారం చేస్తూ, వాటిపై గంటల తరబడి డిబేట్లు పెట్టినప్పుడు — మీలోని కుట్రదారుడు ప్రజలకు కనిపించలేదని మీరు అనుకుంటున్నారా?
ఇలాంటి మైండ్‌సెట్‌తో ఉన్న మీరు, జగన్ మీ పేపర్ చదవనని అన్నాడని ఆయన వ్యక్తిత్వాన్ని నిర్ణయించడం ఎంతవరకు సమంజసం? పెన్నులో కాలకూటం నింపడం మానేసి సిరా నింపితే అక్షరాలు అందంగా వస్తాయి — ఇది గ్రహించండి రాధాకృష్ణ గారు. అక్షరాలు సమాజంలోని రుగ్మతలను దూరం చేయాలి గానీ, సమాజానికే ఒక రుగ్మతగా మారకూడదు. ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. బాధ్యతగా వార్తలు రాయండి. మీలో ఉన్న భయాలు తగ్గాలంటే నిజాయితీనే మార్గమని గ్రహించండి.






