---Advertisement---

బెల్టు షాపులు అడ్డుకోడానికి నువ్వు ఎవడివి – టీడీపీ సీనియర్ నేత దేవదత్

April 13, 2026

Summarize with AI

---Advertisement---

అధికారానికి ధనదాహం తోడై వ్యవస్థలు క్రమంగా బలహీనపడుతున్నాయని రాష్ట్రంలోని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అడుగడుగునా బెల్ట్ షాపులు (Belt shops) పెరిగిపోతుండగా, నిబంధనలు అమలు కావాల్సిన చోట విస్మరణకు గురవుతున్నాయి. గుడుల పక్కన, పాఠశాలల ఎదుట (Schools), రహదారుల (Roads) వెంట కూడా మద్యం విక్రయాలు నిరభ్యంతరంగా కొనసాగుతున్నాయి. ప్రజలకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలు కొరతగా ఉన్నప్పటికీ, మద్యం (Liquor) మాత్రం సులభంగా అందుబాటులో ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

ఈ పరిస్థితిని ప్రతిబింబించేలా ఒక సీనియర్ రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తిరువూరు నియోజకవర్గ శాశన సభ్యులు కొలికపూడి శ్రీనివాస్ (Kolikapudi Srinivas) నీ ఇంటికొచ్చి తంతా అంటూ దూషణలకి దిగడంతో పాటు రాష్ట్రంలో తమ పాలనలో బెల్టు షాపుల దందా ఎంత తీవ్రంగా ఉందో బహిరంగంగానే చెప్పుకుంటున్నారు . ఈ నేపధ్యంలో ఆయన మాట్లాడుతూ బెల్టు షాపులు అడ్డుకోడానికి నువ్వు ఎవడివి.. బెల్ట్ షాపుల్ని నువ్వు అడ్డుకునేది ఏంటి.. 175 నియోజకవర్గాల్లో ఎలా జరిగితే ఇక్కడ అలాగే జరుగుతుంది. ఎమ్మెల్యేగా పార్టీ పరువు తీస్తున్నాడని. టీడీపీ(TDP) సీనియర్ నేత శావల దేవదత్ (Shavala Devadatt) దుయ్యబట్టారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, రాష్ట్రంలో అనధికారిక మద్యం విక్రయాలు విస్తృతంగా జరుగుతున్నాయనేదు రూఢీ అయింది. అధికారంలో ఉన్న కొందరు నేతల ప్రమేయంతో అక్రమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీడియా మద్దతుతో ఈ వ్యవహారాలు పెరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితులు కొనసాగితే పరిపాలనా వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం కావచ్చని, సమాజం అస్థిరతలోకి జారిపోవచ్చని సామాజిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. నిబంధనల అమలు, పారదర్శక పాలన, ప్రజల భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment