రాజకీయాల్లో ఒక వ్యక్తి జీవితం కూడా ఒక “నరేటివ్ టూల్” (Narrative Tool)గా మారిపోవడం కొత్త విషయం కాదు. నర్సీపట్నం మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్ (Dr. Sudhakar ఘటన కూడా అదే కోణంలో పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆయనను జగన్ (YS Jagan Mohan Reddy) ప్రభుత్వమే (Government) వేధించిందనే వాదన ఒక వైపు వినిపిస్తే, మరోవైపు ఆయన్ను ప్రతిపక్షం రాజకీయ ఆయుధంగా మలిచిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధికారంలో ఉండగా కరోనా (COVID-19) సమయంలో నర్సీపట్ణంలో మత్తు వైద్యుడు సుధాకర్ (Dr. Sudhakar) పీపీఈ కిట్ (PPE Kit) అడిగినందుకు ఆయన్ను మానసికంగా వేధించారని. సుధాకర్ మృతికి జగన్ ప్రభుత్వమే కారణమని నాటి నుండి నేటి వరకు ఒక రాజకీయ ఆయుధంగా మలుచుకుని తెలుగుదేశం, జనసేన నాయకులు కార్యకర్తలు చేస్తున్న ఆరోపణలు విదితమే. అయితే నిజంగానే డాక్టర్ సుధాకర్‌ను నాటి జగన్ ప్రభుత్వం వేధించిందా లేక తెలుగుదేశమే(TDP) ఆయన్ను రాజకీయ పావుగా వాడుకుందా అంటే సేకరించిన వివరాల ప్రకారం తెలుగుదేశం ఆడిన రాజకీయ క్రీడలోనే ఆయన్ని బలైపోయాడని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
నాడు జరిగిన సంఘటనలు మరోసారి పరిశీలిస్తే ఆగస్టు 2019లో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో (Area Hospital) మత్తు డాక్టర్ గా పనిచేస్తున్న సుధాకర్, అదే ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ గా ఉన్న డాక్టర్ గౌతమితో (Dr. Gouthami) శాఖాపరమైన వివాదాలు ఉండటం వలన ఆ కోపం ప్రసవానికి వచ్చిన ఆరుగురు గిరిజన గర్భిణీ స్త్రీలపై వివక్షను చూపి వారికి ఆపరేషన్ కు ఎనస్తీషియా (మత్తు) ఇవ్వకుండా ఆసుపత్రి నుంచి వెళ్ళిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనిని తెలుసుకున్న నాటి స్థానిక శాశనసభ్యులు ఉమాశంకర్ గణేష్ (Uma Shankar Ganesh) హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి చేరుకొని అనకాపల్లి నుంచి వెంటనే వేరే మత్తు డాక్టర్ వచ్చి గర్భిణీలకు సుఖ ప్రసవం జరిగే విధంగా ఏర్పాటుచేశారు.

మత్తు డాక్టర్ తీరు మొదటి నుండి వివాదాస్పదంగా ఉండటం గతంలో కూడా అనకాపల్లిలో పనిచేస్తున్నప్పుడు డ్యూటీకి సమయానికి రాకపోవడంతో ప్రశ్నించిన ఏరియా ఆసుపత్రి సూపర్ ఇంటెండెంట్ పై దాడి చేసి పోలీసు కేసులో ఉండటంతో సుధాకర్ వ్యవహారశైలిని తప్పుపడుతూ శాశనసభ్యులు ఉమాశంకర్ తీవ్రంగా మందలించారు. ఇది మనసులో పెట్టుకున్న మత్తు డాక్టర్ సుధాకర్ స్థానిక శాశనసభ్యులైన ఉమాశంకర్ పై తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారు.
ఇక ప్రపంచానికి మహమ్మరిలా పట్టుకున్న కరోనాతో అన్ని దేశాలు పోరాడుతున్న సమయంలో ముఖ్యమంత్రిగా జగన్ గారు కూడా తమ శక్తికి మించి ప్రజలకు తోడుగా నిలబడి ఉన్న సమయంలో గతంలో జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకుని స్థానిక శాశనసభ్యులు ఉమాశంకర్ పై ఆగ్రహంగా ఉన్న సుధాకర్‌ను స్థానిక టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు పిలిపించుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేలా ప్రణాళిక సిద్ధం చేశారని సీసీ ఫుటేజ్ ఆధారంగా విమర్శలు వినిపిస్తున్నాయి.
నాటి ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకుని వచ్చేలా టీడీపీ నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ లో భాగంగా వృత్తి ధర్మాన్ని పక్కన పెట్టి డాక్టర్లకు మాస్కులు కోరుతూ తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీసులకు, ప్రభుత్వానికి తీవ్ర పదజాలంతో విమర్శించారు. నిజానికి నాడు మాస్కుల కోరత లేదని నాటి పరిస్థితులపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అవసరానికి మించి సుధాకర్ మాస్కులు డిమాండ్ చేయడం టీడీపీ కుట్రలో భాగమేనని నాడు సాటి డాక్టర్లే చెప్పిన మాట.
ఈ ఘటనతో స్థానిక శాశన సభ్యులు… సుధాకర్, తెలుగుదేశం నేతలు కలిసి చేసిన కుట్ర కోణాన్ని బయట పెట్టేలా విషయాన్ని ప్రజలకు తెలిసేలా మత్తు డాక్టర్ ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు సుమారు గంటసేపు అయ్యన్న పాత్రుడితో రహస్యంగా కలిసిన సీసీ ఫుటేజ్‌ని బయట పెట్టారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ విచారణకు ఆదేశించి, కుట్ర కోణం బయటపడటంతో డాక్టర్ సుధాకర్‌ను విధులనుండి సస్పెండ్ చేశారు.

ఇక సుధాకర్ సస్పెండ్ తో రంగంలోకి దిగిన టీడీపీ పార్టీ కుల రాజకీయాలకు తెరలేపుతూ గిరిజన గర్భిణీ స్త్రీలు అని కూడా కనికరం చూపకుండా వ్యవహరించిన మత్తు డాక్టర్, దళితుడుగా సెంటిమెంట్ పాలిటిక్స్ కి తెరలేపారు. ఇది ఇలా ఉండగా సస్పెండ్ అయిన మత్తు డాక్టర్ ముస్లిం, క్రైస్తవ సమాజాన్ని పట్టుకుని ప్రజల ముందుకు ముస్లింలు, క్రైస్తవులు ఉగ్రవాదులు అంటూ రోడ్డుపెక్కి ఒకసారిగా వార్తల్లోకి ఎక్కారు. మరోసారి మత్తు డాక్టర్ కుమారుడు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పోర్ట్ పోలీసులు బైక్ సీజ్ చేస్తే సుధాకర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి నానా హంగామా చేసి కలకలం రేపారు.
మరో సారి విశాఖాలో కారులో వెలుతు మధ్యం మత్తులో బైక్‌ను డీకొట్టి ప్రమాధానికి పాల్పడటమే కాకుండా, స్థానికులను తనకు కరోనా ఉందని వస్తే తమకి అంటిస్తానని బెదిరించడంతో పాటు చోక్కా విప్పి లారీ కింద పోడుకుంటే.. పోలీసులు ఆయనను బయటకు తీసి అరెస్ట్ చేశారు. డాక్టర్ సుధాకర్ చేసినది తప్పే అయినా తనపై పోలీసులు అలా ప్రవర్తించినందుకు నాటి జగన్ ప్రభుత్వమే ఆ సదరు పోలీసులపై క్రమశిక్షణ చర్యలకు పాల్పడింది. ఈ అరెస్టును కూడా తెలుగుదేశం తమ రాజకీయానికి వాడుకునే ప్రయత్నం చేసింది.

మత్తు డాక్టర్ గా వార్తల్లో నిలిచిన సుధాకర్ ఈ ఘటనలు జరిగిన ఏడాది తరువాత గుండెపోటుతో మరణించారు. మరణానికి ముందే ఒకానొక సందర్భంలో మత్తు డాక్టర్ సుధాకర్, అయ్యన్న పాత్రుడు తనని కుక్కలా వాడుకున్నాడని ఆవేదన చెందుతున్న వీడియోని సైతం సోషల్ మీడియాల్లో వైరల్ అయింది. ఒక సామాన్యమైన డాక్టర్ ఉద్రేక మనస్తత్వాన్ని తమ రాజకీయాలకు వాడుకుని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లబ్దిపొందాలనే ఆలోచన చేసి, చివరికి ఆ వ్యక్తి చేత తప్పులు మీద తప్పులు చేసేలా వెనుకనుంచి పోత్సహించి అకారికి తెలుగుదేశం సాధించింది ఏమిటి? … తెలుగుదేశానికి నమ్మిన మత్తు డాక్టర్ సుధాకర్ ఏమి సాధించాడు? అంటూ అనేక మంది ఇప్పటికీ వేస్తున్నారు ప్రశ్న?
ఇప్పటికైనా ఇలాంటి రాజకీయాలను తెలుగుదేశం మనకొవాలని, అలాగే తెలుగుదేశం మాటలను నమ్మి వారి ఆటలో పావుగా సామాన్యులు మారకూడదని.. మల్లెల్ల బాబ్జీ ఉదంతమైన , డాక్టర్ సుధాకర్ ఉదంతాన్ని చెప్పే నీతి ఇదే అని పలువురు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఇదే డాక్టర్ చావును ఇప్పటికీ తెలుగుదేశం సోషల్ మీడియాలో, జగన్ నర్సీపట్నం పర్యటనలో వాడుకోవడం చూస్తే వారిలో ఉన్న కుటిల బుద్ది బయట పడుతుందని వైసీపీ నేతలు చెబుతున్న మాట.
నిజంగా దళితులపై అంత అక్కరే ఉంటే, కాకినాడలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దళితుడైన రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేస్తే ఏం చర్యలు తీసుకున్నారని, అలాగే దళితురాలైన జనసేన ఎమ్మెల్యే అరవశ్రీధర్ బాధితురాలిపై ఆ పార్టీ నేతలే నడి రోడ్డుపై లాఠీతో దాడి చేసినప్పుడు ఏం చర్యలు తీసుకున్నారని, పలు దళిత సంఘాల నుండి వినిపిస్తున్న మాట.
అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రపూరితంగా వ్యవహరించారని డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేయడం తప్పుగా చూపారు, కానీ ఇదే తెలుగుదేశం జనసేన తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని మార్కాపురం జిల్లా కనిగిరి మండలం తాళ్లూరు ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దద్దాల శ్రీనివాస్‌ను సస్పెండ్ చేయడం, అతని పై కేసు నమోదు చేయడం చేయలేదా? అని, అమరావతి రాజధాని నిర్మాణంపై సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేసినందుకు వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ సిద్ధార్థి సుభాష్ చంద్రబాస్‌పై సస్పెన్షన్ విధించలేదా? మరి దీనిని ఎలా సమర్దించుకుంటారో కూడా చెప్పాలని పలువురు రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తున్న మాట.






