రాష్ట్రంలో మత్స్యకారుల హక్కులపై (Fishermen Rights) మరోసారి తీవ్ర చర్చకు దారితీసే విధంగా వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ((Juvvaladinne Fishing Harbor) పరిశీలించిన అనంతరం స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలతో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. జువ్వలదిన్నె ప్రాజెక్టు పూర్తి అయ్యి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ మత్స్యకారులకు అప్పగించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం (Present Government) మత్స్యకారుల ప్రయోజనాలను పక్కనపెట్టి, హార్బర్‌ను ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించే ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు. స్థానిక మత్స్యకారులు పట్టుకున్న బోట్ల వ్యవహారంలో అనుమానాస్పద పరిణామాలు చోటుచేసుకున్నాయని, దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ ప్రమేయం ఉందని విమర్శించారు.
మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీయాలనే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించిన జగన్, ఫిషింగ్ హార్బర్లు (Fishing Harbors) పూర్తిగా మత్స్యకారుల హక్కులేనని స్పష్టం చేశారు. భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఈ హార్బర్లను పూర్తిగా మత్స్యకారులకే అందజేస్తామని, ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి తరలిస్తామని హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీయడమే కాకుండా ఉపాది పట్ల మత్స్యకారులకు భరోసా కల్పించాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






