---Advertisement---

బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

April 24, 2026

---Advertisement---

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి కుటుంబానికి సంబంధించిన ఒక రాజకీయ పరిణామం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలిశారు. దీంతో ఆమె త్వరలో కమలం పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం మరింత వేగం అందుకుంది.

గత కొన్ని రోజులుగా డాక్టర్ ప్రీతి రెడ్డి బీజేపీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీ కార్యాలయానికి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో మల్లారెడ్డి కుటుంబం రాజకీయంగా కొత్త నిర్ణయం తీసుకోబోతుందా అనే చర్చ మొదలైంది.

గతంలో మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డితో కలిసి డాక్టర్ ప్రీతి రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మల్లారెడ్డి విద్యాసంస్థల్లో గూగుల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ కృత్రిమ మేధస్సు కేంద్ర ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు.

ప్రస్తుతం డాక్టర్ ప్రీతి రెడ్డి మల్లారెడ్డి విద్యాసంస్థల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విద్యార్థులు, సమాజం కోసం చేస్తున్న సేవలకు గాను ఆమెకు 2024లో ఛాంపియన్షిప్ చేంజ్ అవార్డు లభించింది.

అలాగే 2025 ఏప్రిల్‌లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో తీవ్ర అస్వస్థతకు గురైన 74 ఏళ్ల వృద్ధుడికి అత్యవసర వైద్యం చేసి ప్రాణాలు కాపాడారు. ఆ ఘటనతో ఆమె దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment