---Advertisement---

రాష్ట్రంలో ఇందన కొరత పాలనా వైఫల్యమే – జగన్

April 27, 2026

Summarize with AI

---Advertisement---

రాష్ట్రంలో ఏర్పడిన ఇంధన కొరతపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యల్లో, సమస్యలను అవకాశాలుగా మార్చుకుని లాభాలు పొందడం ప్రస్తుత ప్రభుత్వానికి అలవాటైందని ఆయన ఆరోపించారు. విత్తనాలు, ఎరువులు, యూరియా నుండి వంటగ్యాస్ వరకు అనేక రంగాల్లో కృత్రిమ కొరతలు సృష్టించబడ్డాయని పేర్కొన్నారు. తాజాగా పెట్రోల్ మరియు డీజిల్ సరఫరాలో కూడా అదే ధోరణి కొనసాగుతోందని ఆయన విమర్శించారు.

పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ఎలాంటి ఇంధన కొరత లేకపోయినా, రాష్ట్రంలో మాత్రం డీలర్లు మరియు రాజకీయ నాయకులు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా కొరత సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల తరువాత ధరలు పెరిగే అవకాశాన్ని ఉపయోగించుకుని డీజిల్, పెట్రోల్ నిల్వ చేసి బ్లాక్ చేస్తున్నారని, దీనివల్ల ప్రజలు భయంతో అధికంగా కొనుగోలు చేయడం వల్ల డిమాండ్ పెరిగిందని చెప్పడం కేవలం సాకులేనని ఆయన స్పష్టం చేశారు.

ఈ కృత్రిమ కొరత ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రబీ పంటల కోత సమయంలో ట్రాక్టర్లు మరియు కోత యంత్రాలకు అవసరమైన డీజిల్ అందక రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రోజుకు వందల లీటర్ల డీజిల్ అవసరమయ్యే యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఆక్వా రంగంలో కూడా డీజిల్‌పై ఆధారపడే యంత్రాలు పనిచేయక, రొయ్యల పెంపకం దెబ్బతింటోందని వివరించారు.

ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యను సమగ్రంగా సమీక్షించి తక్షణ చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు మరింత విషమిస్తాయని హెచ్చరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment