---Advertisement---

కూటమి పాలనలో సొంత పార్టీ కార్యకర్తలపైనా పెరుగుతున్న ఆ పార్టీ నాయకుల వేదింపులు?

May 4, 2026

---Advertisement---

తూర్పు గోదావరి జిల్లా(East Godavari District) నిడదవోలు మండలం (Nidadavole Mandal) సింగవరం గ్రామానికి చెందిన టీడీపీ బూత్‌ ఇన్‌చార్జి (TDP Booth Incharge) కట్టా మణికంఠ (Katta Manikantha) సోషల్ మీడియాలో విడుదల చేసిన సెల్ఫీ వీడియో (Selfie Video) రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) అనుచరుల వేధింపులు, అక్రమ కేసుల మానసిక ఒత్తిడి తట్టుకోలేక తాను ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వచ్చానని మణికంఠ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసుల వైఖరి, స్థానిక నేతల ఒత్తిళ్లు, భూముల వివాదాలు కలసి తనను తీవ్ర నిరాశలోకి నెట్టాయని పేర్కొన్నాడు.

ఈ ఘటనతో నిడదవోలు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మణికంఠ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, టీడీపీ నాయకులు నిరసనలకు దిగారు. ఈ సంఘటన ఒక్కటే కాకుండా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల్లో అంతర్గత విభేదాలు, స్థానిక నేతల మధ్య ఘర్షణలు పెరిగినట్లు పలు ఘటనలు సూచిస్తున్నాయి.

జనసేన మరియు తెలుగుదేశం పార్టీలకు(TDP) చెందిన పలువురు కార్యకర్తలు వేధింపులు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ నిర్లక్ష్యం కారణంగా ఆత్మహత్యలు లేదా ఆత్మహత్యా యత్నాలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఏలూరు, కృష్ణా, చిత్తూరు, అనంతపురం, గుంటూరు వంటి జిల్లాల్లో చోటుచేసుకున్న ఈ ఘటనలు కార్యకర్తల ఆవేదనను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.

పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లేదని, కడప ఎమ్మెల్యే(Kadapa MLA) మాధవి(Madhavi) కొత్తవారిని ప్రోత్సహిస్తున్నారని నిరసిస్తూ చిప్పిగిరి మీనాక్షి(Chippigiri Meenakshi) అనే తెలుగుదేశం నాయకురాలు సెల్ టవర్ ఎక్కి మహానాడు రోజే నిరసన తెలపడం. తెలుగుదేశం ఎస్సీ సెల్ నేత అయిన సాకే వెంకటేష్ ‘మినీ మహానాడు'(Mini Mahanadu)వేదికపైనే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేయడం. పార్టీ అధికారంలోకి వచ్చాక పాత కార్యకర్తలను పట్టించుకోకుండా వలస వచ్చిన వారికే పదవులు ఇస్తున్నారని ఆయన ఆరోపించడం. విడవలూరు మండలానికి చెందిన మైనారిటీ నేత ఇమామ్ బాషా(Imam Basha) మీడియా ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేయడం పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసినా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి (Vemireddy Prashanthi) తనను గుర్తించకుండా వలస నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన చెందడం లాంటి పరిణామాలు ఆ పార్టీ కార్యకర్తల వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయని పలువురు చెబుతున్న మాట .

పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు లేకపోవడం, కొద్ది మంది కొటరీకే నాయకులు విచ్చలవిడి దోపిడీకి అవకాశం కల్పించడం, స్థానిక సమస్యలు పరిష్కరించకపోవడం, అధికారుల దగ్గర తమ మాట చెల్లుబాటు కాకపోవడం వంటి కారణాలు ఈ తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు రాజకీయ పార్టీల్లో ఉన్న అంతర్గత సంక్షోభాన్ని బయటపెడుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment