---Advertisement---

ఎవరికోసం ఈ అప్పుల వర్షం..? రాష్ట్ర భవిష్యత్తుపై పెరుగుతున్న గుబులు!

May 6, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ఆర్థిక పరిస్థితులపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం (State Government) భారీ స్థాయిలో అప్పులు (Debts) చేస్తుండటం ప్రజల్లో ఆందోళనలకు దారితీస్తోంది. తాజాగా ఒక్కరోజులోనే సుమారు రూ.4,400 కోట్ల మేర రుణం సమీకరించగా, కేవలం 23 నెలల వ్యవధిలో మొత్తం అప్పులు రూ.3.62 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ స్థాయి అప్పుల భారాన్ని ప్రజలపై(People) మోపడం సమంజసమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అప్పులు పెరుగుతున్నప్పటికీ, వాటి ప్రభావం ప్రజల జీవితాల్లో స్పష్టంగా కనిపించకపోవడం మరో కీలక అంశంగా మారింది. సంక్షేమ కార్యక్రమాలు పరిమితమవుతుండగా, తీసుకొస్తున్న అప్పులు ఎక్కడ వినియోగం అవుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రజలకు నేరుగా ఉపయోగపడని అప్పులను భవిష్యత్తులో పన్నులు, ధరల రూపంలో తిరిగి భరించాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

గత ప్రభుత్వ కాలంలో అప్పులపై జరిగిన చర్చలు, ప్రస్తుత గణాంకాలతో పోలిస్తే పలు సందేహాలు లేవనెత్తుతున్నారు. ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, గత ఐదేళ్లలో చేసిన అప్పులతో పోలిస్తే ప్రస్తుతం 23 నెలల వ్యవధిలోనే నాటి కన్న అధికంగా రూ.3.62 లక్షల కోట్లకు అప్పులు చేరాయని . ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక ప్రస్తుతం ప్రభుత్వం నెలకు సగటున రూ.15,776 కోట్లు, రోజుకు రూ.526 కోట్లు అప్పు చేస్తోందన్న లెక్కలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. బడ్జెట్ పరిధిలో మరియు వెలుపల తీసుకున్న రుణాలు కలిసి రాష్ట్ర ఆర్థిక స్థిరత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి.

ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై పారదర్శకత అవసరమని, తీసుకున్న అప్పుల వినియోగంపై స్పష్టమైన వివరాలు ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే, భవిష్యత్తులో ఈ అప్పుల భారాన్ని భరించాల్సింది సాధారణ ప్రజలేననే వాస్తవం మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment