---Advertisement---

గ్రామ వార్డు సచివాలయాల పేర్లు మార్చాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు?

May 8, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సచివాలయంలో (Secretariat) నిర్వహించిన 7వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను ఇకపై “స్వర్ణ గ్రామం”(Swarna Gramam), “స్వర్ణ వార్డులు”(Swarna Wards) గా పిలవాలని అధికారులకు సూచించిన చంద్రబాబు వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఘాటు విమర్శలు చేస్తున్నాయి.

ఇప్పటికే పలు ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి వాటిని తన పాలన విజయాలుగా ప్రచారం చేసుకుంటున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, తాజా వ్యాఖ్యలు ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రతిపక్షాల ఆరోపణల ప్రకారం, ఎన్టీఆర్(NTR) ప్రారంభించిన శ్రమదానం కార్యక్రమాన్ని కొత్త రూపంలో తనదిగా ప్రచారం చేసుకున్నారని, అలాగే నెదురుమల్లి జనార్ధన్ రెడ్డి హయాంలో ప్రారంభమైన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్, హైటెక్ సిటీ ఆలోచనలను పూర్తిగా తన విజన్‌గా ప్రజల్లో ప్రొజెక్ట్ చేశారని విమర్శిస్తున్నారు.

అదేవిధంగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy) ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి “ఎన్టీఆర్ వైద్య సేవ”(NTR Vaidya Seva)గా పేరు మార్చారని, జగన్ (Y. S. Jagan Mohan Reddy) ప్రభుత్వంలోని (Government) అమ్మఓడి, రైతు భరోసా, గ్రామ-వార్డు సచివాలయాల వంటి పథకాలకు కూడా కొత్త పేర్లు పెట్టి వాటిని తన పాలన గుర్తింపుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తమిళనాడులో జయలలిత ప్రవేశపెట్టిన “అమ్మా క్యాంటిన్” నమూనాను అనుసరించి “అన్నా క్యాంటిన్”(Anna Canteen) పేరుతో తీసుకొచ్చి దానిని కూడా తన బ్రెయిన్ చైల్డ్‌గా ప్రచారం చేసుకున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

“తన రాజకీయ జీవితంలో పూర్తిగా కొత్తగా గుర్తింపు పొందే సంక్షేమ పథకం తీసుకురావడం కన్నా, ఇప్పటికే ప్రజల్లో గుర్తింపు పొందిన పథకాలను కాపీ కొట్టి, పేర్లు మార్చి తనవిగా ప్రచారం చేసుకోవడమే చంద్రబాబు రాజకీయ శైలి” అంటూ ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment