---Advertisement---

ఢిల్లీ ఇంటి హంగులకు రూ.67 లక్షలు?.. చంద్రబాబు ఖర్చులపై విమర్శల వెల్లువ?

May 13, 2026

---Advertisement---

రాష్ట్రంలో అభివృద్ధి పనులు (Development Works), సంక్షేమ కార్యక్రమాలు(Welfare Schemes), ఉద్యోగాల కల్పన (Employment Generation) వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నిధుల కొరతను చూపుతున్న వేళ.. సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) ఢిల్లీ నివాసానికి (Delhi Residence) మాత్రం వరుసగా కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చవుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సీఎం ఢిల్లీ నివాసంలో సౌకర్యాలు, హంగులు, మరమ్మతుల పేరుతో భారీగా ఖర్చులు చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో రూ.67 లక్షల మంజూరుకు ఉత్తర్వులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఢిల్లీ నివాసంలో మీటింగ్ హాల్ ఏర్పాట్లు (Meeting Hall Arrangements), మైనర్ రిపేర్లు, అదనపు సదుపాయాల కోసం ఈ నిధులను (Funds) వినియోగించనున్నారు. ఇదే నివాసానికి గతంలో రూ.95 లక్షల వరకు ఖర్చు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ కొత్తగా రూ.67 లక్షలు కేటాయించడం వివాదాస్పదంగా మారింది. దీంతో మొత్తం ఖర్చు రూ.1.62 కోట్లకు చేరినట్లు సమాచారం.

ఇప్పటికే సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు హైదరాబాదు(Hyderabad), విజయవాడ (Vijayawada), అమరావతి (Amaravati) ప్రాంతాల్లో ప్రభుత్వ నిధులతో భారీ స్థాయిలో సదుపాయాలు కల్పించుకున్నారనే విమర్శలు గతంలోనూ వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి (State Financial Condition) క్లిష్టంగా ఉందని ఒకవైపు ప్రభుత్వం చెబుతుండగా.. మరోవైపు సీఎం నివాసాల హంగులు, విలాసాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది.

రాష్ట్రంలో రైతులు (Farmers) పంట నష్టాలతో (Crop Losses) ఇబ్బందులు పడుతుండగా, ఉద్యోగులకు బకాయిల సమస్యలు (EmployeesPending Dues Issues) కొనసాగుతుండగా, సంక్షేమ పథకాల అమలులో కోతల ఆరోపణలు వస్తున్న సమయంలో సీఎం నివాసాలపై భారీ ఖర్చులు అవసరమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రజల పన్నుల రూపంలో వచ్చే డబ్బును పాలకులు బాధ్యతగా వినియోగించాలన్న డిమాండ్ బలపడుతోంది.

ఇప్పటికే అమరావతి నిర్మాణం పేరుతో భారీ వ్యయాలు, అవసరానికి మించి ప్రత్యేక విమాన ప్రయాణాలు, అధికార నివాసాల విలాసవంతమైన మార్పులు వంటి అంశాలపై చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్రం రోజు రోజుకి అప్పుల ఊబిలోకి కూరుకుపోతుంటే చంద్రబాబు గారు మాత్రం రూ.931.83 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలవడం విమర్శలకి మరింత ఆజ్యం పొస్తుంటే ఇప్పుడు ఢిల్లీలో విలాస నివాసంపై వరుసగా ఖర్చులు పెరగడం ఆ విమర్శలకు మరింత బలం చేకూర్చుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment