అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన పొదుపుపై కేంద్రం దృష్టి సారించగా.. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇచ్చిన పిలుపుకు స్పందించిన ఢిల్లీ ప్రభుత్వం (Delhi Government) కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) సౌకర్యం కల్పిస్తున్నట్లు సీఎం రేఖా గుప్తా (CM Rekha Gupta) ప్రకటించారు. ఈ నిర్ణయం రేపటి నుంచే అమల్లోకి రానుంది.
ఇంధన వినియోగాన్ని(Fuel Usage) తగ్గించే లక్ష్యంతో ప్రతి సోమవారం “మండే మెట్రో” (Monday Metro) విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ వ్యక్తిగత వాహనాలను వాడకుండా తప్పనిసరిగా మెట్రోలోనే ప్రయాణించాలని సూచించింది. సామాన్య ప్రజలు కూడా వారానికి 1 రోజు “నో వెహికల్ డే” (No Vehicle Day) పాటించాలని విజ్ఞప్తి చేసింది.
కొత్త వాహనాల కొనుగోళ్లపై (New Vehicles Purchases) 6 నెలలపాటు నిషేధం విధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. అలాగే వచ్చే 1 సంవత్సరం పాటు మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది.
పొదుపు చర్యల్లో భాగంగా సీఎం రేఖా గుప్తా తన అధికారిక కాన్వాయ్‌ను (Convoy) 60 శాతం మేర తగ్గించుకున్నారు. గతంలో ఉన్న భారీ వాహనాల బృందాన్ని కేవలం 4 వాహనాలకు పరిమితం చేశారు. వాటిలో 2 ఎలక్ట్రిక్ వాహనాలు ఉండటం ప్రత్యేకతగా నిలిచింది. కాలుష్య రహిత, సుస్థిర ప్రయాణ వ్యవస్థను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఉద్యోగుల ప్రయాణ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌ను (Transport Allowance) 10 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల(AC’s) ఉష్ణోగ్రతను 24 నుంచి 26 డిగ్రీల మధ్యే ఉంచాలని నిర్ణయించింది. అదనపు విద్యుత్ వాడకాన్ని అరికట్టేందుకు మాస్టర్ స్విచ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇంధన పొదుపు, ఖర్చుల నియంత్రణ పేరుతో ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వరుస నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వర్క్ ఫ్రమ్ హోమ్(Work From Home), వాహనాల పరిమితి (Vehicle Restriction), విదేశీ పర్యటనల నిషేధం (Ban On Foreign Tours) వంటి చర్యలు చూస్తుంటే.. మరోసారి లాక్‌డౌన్ తరహా పరిస్థితులకు తొలి అడుగు పడిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.






