ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేపల్లె కాంగ్రెస్ (Repalle Congress) నేత మోపిదేవి శ్రీనివాసరావు (Mopidevi Srinivasa Rao) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో (YSRCP) చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) సమక్షంలో మోపిదేవికి పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు.
మోపిదేవి శ్రీనివాసరావుతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు (Congress Leaders) కూడా వైఎస్సార్‌సీపీలో చేరడం గమనార్హం. ఈ సందర్భంగా చేరికల అనంతరం జగన్ మాట్లాడుతూ, “మోపిదేవి శ్రీనివాసరావు ఇకపై వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యుడు. నా మీద నమ్మకం ఉంచి పార్టీలోకి వచ్చారు. ఆయనకు అన్ని రకాలుగా న్యాయం చేస్తాను” అని పేర్కొన్నారు.
అలాగే రేపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి మోహన్ కృష్ణకు (Mohan Krishna) పూర్తి మద్దతు ఇవ్వాలని, వచ్చే ఎన్నికల్లో గెలుపు బాధ్యతలు తీసుకోవాలని కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు. “మోపిదేవి శ్రీను చేసే మంచిని జగన్ ఎప్పటికీ మరచిపోడు. అవసరమైన సమయంలో చట్టసభలో కుర్చీ వేసి కూర్చోబెట్టే స్థాయికి తీసుకెళ్తాం” అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కాపు సామాజికవర్గానికి (Kapu Community) చెందిన మోపిదేవి శ్రీనివాసరావు రేపల్లె ప్రాంతంలో బడుగు, బలహీన వర్గాల్లో మంచి గుర్తింపు ఉన్న నాయకుడిగా పేరుపొందారు. ఆయన వైఎస్సార్‌సీపీలో చేరికతో రేపల్లె రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలపై రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు.






