---Advertisement---

జనసేనలో మరో నేతపై వేధింపుల కేసు? వరుస ఆరోపణలతో అప్రతిష్ఠ మూట కట్టుకుంటున్న జనసేన

May 18, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో జనసేన పార్టీ (Jana Sena Party) నాయకులపై వరుసగా వస్తున్న అక్రమ సంబంధాలు, గృహ హింస, లైంగిక వేధింపుల (Sexual Harassment) ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో తాము ఆదర్శప్రాయ నాయకులమని ప్రచారం చేసుకునే కొందరు నేతలపై ఇలాంటి ఆరోపణలు వరుసగా వెలుగులోకి రావడం పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar), చిత్తూరు జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్(Kiran Royal), స్టార్ ప్రచారకర్త జానీ మాస్టర్(Jani Master), మత్స్యకార నాయకుడు మల్లాడి రాజు(Malladi Raju), జడ్పీటీసీ జయప్రకాశ్ నాయుడు (Jayaprakash Naidu) వంటి పలువురు నేతలపై వివిధ ఆరోపణలు రావడంతో పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోందనే చర్చ సాగుతోంది. ఇప్పుడు అదే జాబితాలో కదిరి జనసేన నేత భైరవ ప్రసాద్ (Bhairava Prasad) పేరు చేరడం మరోసారి సంచలనంగా మారింది.

కదిరి నియోజకవర్గ (Kadiri Constituency) జనసేన పార్టీ ఇంచార్జ్ (Jana Sena Party Incharge) భైరవ ప్రసాద్ తనను కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆయన భార్య శశికళ (Sasikala) పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త అలవాట్ల గురించి ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురై ఐరన్ రాడ్‌తో (Iron Rod)‌ దాడి చేశాడని ఆమె ఆరోపించారు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలు అయ్యాయని, అడ్డుకునేందుకు వచ్చిన కుమార్తె సాయి వర్షిణిపై (Sai Varshini)కూడా దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కదిరి టౌన్‌లోని ఎన్జీవో కాలనీలో నివసిస్తున్న ఈ కుటుంబంలో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గాయపడిన తల్లి, కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు సమాచారం. ముఖ్యంగా శశికళ తలకు బలమైన గాయాలు కావడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవలే భైరవ ప్రసాద్ మంత్రి నారా లోకేష్‌ను(Nara Lokesh) కలిసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అయితే కొద్ది రోజులకే కుటుంబ హింస ఆరోపణలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

జనసేన నేతలపై వరుసగా వస్తున్న అక్రమ సంబంధాలు, గృహ హింస, లైంగిక వేధింపుల కేసులు పార్టీ ఇమేజ్‌పై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వరుస ఘటనలు బయటపడుతున్నా అధినేతగా పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండటం ప్రజల్లో పార్టీ నాయకత్వంపై వ్యతిరేక భావన పెరిగే అవకాశం ఉందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment