---Advertisement---

పవన్ కల్యాణ్‌కు అమరావతి నిజాలు అర్థమయ్యాయా..? పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

May 18, 2026

---Advertisement---

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల “జై అమరావతి” (Jai Amaravati) కాదని, “జై ఆంధ్ర”(Jai Andhra) అనాలని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) తీవ్ర స్థాయిలో స్పందించారు. అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) భారీ స్థాయిలో దోపిడీ జరుగుతోందని పవన్ కల్యాణ్ గ్రహించారని, అందుకే ఆయన “జై అమరావతి”కి బదులుగా “జై ఆంధ్ర” అన్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

కూటమి ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలవదని పవన్ కల్యాణ్ ముందుగానే అర్థం చేసుకున్నారని పేర్ని నాని జోస్యం చెప్పారు. అమరావతి నిర్మాణం పేరుతో 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ (Land Pooling) చేపట్టారని, అయితే దాదాపు 54 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం పేరుతో భూములను వినియోగిస్తున్నారని ఆరోపించారు. భూములు ఇచ్చిన రైతులకు (Farmers) ఇప్పటి వరకు ప్లాట్లు పూర్తిగా కేటాయించలేదని అన్నారు. రైతులు ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని విమర్శించారు.

అమరావతి గురించి ప్రశ్నిస్తే దాన్ని రాజధానికి అవమానం అంటున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను ప్రస్తావించడం తప్పా అని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధి (Amaravati Development) పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పైనా (Pemmasani Chandrasekhar) పేర్ని నాని విమర్శలు గుప్పించారు. పెమ్మసాని ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జెండా పట్టుకుని కష్టపడ్డారా అని ప్రశ్నించారు. కార్యకర్తల కష్టం ఆయనకు ఏమాత్రం తెలియదని ఎద్దేవా చేశారు. అమరావతిలో మట్టిని (Soil) అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు.

గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ (Gannavaram Airport Expansion) కోసం 700 ఎకరాల భూమి ఎందుకు అవసరమో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. మట్టి దోపిడీ కోసమే భారీ స్థాయిలో భూములు సేకరిస్తున్నారని ఆరోపించారు. రోజుకు 1000 టిప్పర్ల మట్టిని తరలిస్తున్నారని పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment