సామాన్యుడిపై మరోసారి ఇంధన ధరల (Fuel Prices) భారం పడింది. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) ధరల పెంపు కొత్త షాక్‌గా మారింది. దేశవ్యాప్తంగా మంగళవారం (మే 19) పెట్రోల్‌పై లీటరుకు 86 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెంచుతూ (Increasing) నిర్ణయం తీసుకోవడంతో వాహనదారులు (Vehicle Owners) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడచిన ఐదు రోజుల్లో ఇది రెండోసారి ధరలు పెరగడం గమనార్హం. గత వారంలోనే లీటరుకు దాదాపు మూడు రూపాయల వరకు పెరిగిన ధరలు, ఇప్పుడు మళ్లీ పెరగడంతో ప్రజలపై ఆర్థిక ఒత్తిడి (Financial Pressure) మరింత పెరిగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల కంటే ఇంధన ధరలు అధికంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ఇంధన ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పెరుగుతున్న ధరలను ఎందుకు నియంత్రించలేకపోతోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రత్యేకంగా 2015 ఫిబ్రవరిలో జారీ చేసిన జి.ఓ ఎం.ఎస్ 27 ద్వారా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం (Telugu Desam Government) పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు అదనంగా రూ.4 వ్యాట్ (VAT) విధించింది. ఆ నిర్ణయం ప్రకారం పెట్రోల్‌పై 31 శాతం + రూ.4, డీజిల్‌పై 22.25 శాతం + రూ.4 పన్ను కొనసాగుతోంది. 2026 నాటికీ ఆ అదనపు వ్యాట్ కొనసాగుతుండటంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

“అధికారంలోకి వస్తే వ్యాట్ తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు?”, “ఆ అదనపు రూ.4 వ్యాట్ తొలగిస్తే ప్రజలకు కొంత ఉపశమనం కలుగదా?” అంటూ ప్రజలు నేరుగా ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచిందని చెప్పడం కంటే, రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్న పన్నులను తగ్గించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇంధన ధరల పెరుగుదల ప్రభావం కేవలం వాహనదారులపైనే కాకుండా అన్ని నిత్యావసర వస్తువుల ధరలపై పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గ్యాస్(Gas), వంటనూనె (Cooking Oil), కూరగాయల ధరలతో (Vegetables Prices) ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మరింత భారంగా మారిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంధన ధరల పెంపును కొందరు రాజకీయ నాయకులు సమర్థించడం ప్రజలను మరింత అసహనానికి గురిచేస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు మాత్రం “హామీ ఇచ్చినట్టే వ్యాట్ తగ్గించి ఉపశమనం కల్పిస్తారా లేదా?” అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.






