---Advertisement---

Mamata Banerjee: కేంద్రంలో మోదీ సర్కార్‌ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..

May 20, 2026

---Advertisement---

పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో మరోసారి తీవ్ర రాజకీయ వేడి రాజుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం(BJP Government) ఎక్కువ కాలం కొనసాగదని, త్వరలోనే కేంద్రంలో అధికార మార్పు (Power Change) తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నివాసంలో టీఎంసీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన కీలక సమావేశంలో మాట్లాడిన మమతా బెనర్జీ.. దేశవ్యాప్తంగా బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో తాజాగా ఏర్పడిన రాజకీయ పరిణామాలపై కూడా మమత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా మైనారిటీ వర్గాలను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అదేవిధంగా రోడ్ల పక్కన చిన్న వ్యాపారాలు చేసుకునే హ్యాకర్ల దుకాణాలను(Shops) బుల్డోజర్లతో (Bulldozers) కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య సూత్రాలను పూర్తిగా పక్కన పెట్టిందని విమర్శించారు. ఎన్డీయే కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ కేంద్రంలో అధికారాన్ని కోల్పోవడం ఖాయమని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

ఇక ఈ సమావేశంలో పాల్గొన్న టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) కూడా బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలోని తన నివాసంలో అనధికారిక నిర్మాణాలున్నాయంటూ కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికీ టీఎంసీ ఆధీనంలోనే కొనసాగుతోంది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన ఫిర్హాద్ హకీమ్ (Firhad Hakim) ప్రస్తుతం కోల్‌కతా మేయర్‌గా ఉన్నారు.

ఈ నోటీసులపై స్పందించిన అభిషేక్ బెనర్జీ.. తాను ఎలాంటి బెదిరింపులకు భయపడబోనని స్పష్టం చేశారు. “నా ఇల్లు(House) కూల్చేస్తారా.. నోటీసులు పంపుతారా.. వాళ్లు ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి. కానీ నేను తలవంచను. బీజేపీకి వ్యతిరేకంగా నా పోరాటం (Fight Against BJP) ఆగదు” అంటూ ఘాటుగా స్పందించారు. తనపై రాజకీయ కక్షతోనే ఈ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిపై (Suvendu Adhikari) కూడా అభిషేక్ బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. 2014లో జరిగిన వివాదాస్పద నారద స్టింగ్ ఆపరేషన్‌ను గుర్తు చేస్తూ.. “డబ్బులు తీసుకుంటూ కెమెరాకు చిక్కిన వ్యక్తిని ఈరోజు ముఖ్యమంత్రిని చేశారు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో టీఎంసీలో(TMC) ఉన్న సువేందు అధికారి ఇప్పుడు బీజేపీ తరఫున వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు తెలుసని అన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న హ్యాకర్ల బలవంతపు తరలింపులు, బుల్డోజర్ రాజకీయాలను నిరసిస్తూ మే 21 నుంచి భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టాలని టీఎంసీ నిర్ణయించింది. కోల్‌కతా పరిసర ప్రాంతాలైన బల్లిగంజ్, హౌరా జంక్షన్, సీల్దా రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment