తమిళనాడులో (Tamil Nadu) ప్రభుత్వ కార్యాలయాల్లో పెరుగుతున్న అవినీతిపై TVK అధినేత, నటుడు విజయ్(Viajy) సంచలన నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వ అధికారులు లంచం (Bribe) తీసుకున్నట్లు ఆధారాలతో ఫిర్యాదు చేసిన వారికి రూ.1 లక్ష నగదు బహుమతి (Rs.1 Lakh Cash Reward) ఇస్తామని వెల్లడించారు.
రూ.1000 లంచం తీసుకున్న ఘటనపై సమాచారం ఇచ్చినా అదే స్థాయిలో ప్రోత్సాహకం అందిస్తామని విజయ్ తెలిపారు. అవినీతిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రజలు కూడా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో (Government Offices)సాధారణ ప్రజలు (Common People) ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ పేర్కొన్నారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, లంచం తీసుకునే వారిపై మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విజయ్ చేసిన ఈ ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, మరికొందరు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.






